ఏపీ: మాజీ సీఎం జగన్ ఇంటి మార్పులు..!
ఆ ఇల్లు కట్టుకోవడం వల్లే జగన్ సీఎం అయ్యారని కూడా కొంతమంది విశ్లేషకులు తెలియజేస్తున్నారు. కొన్ని వార్త పత్రికలు కూడా వాస్తు మార్పులు ఇప్పుడు చేస్తున్నారనే విధంగా హైలైట్ చేస్తున్నారు.2024 లో గోర ఓటమి తర్వాత మరొకవైపు చాలామంది నేతలు కూడా పార్టీని వేయడం వంటివి జరుగుతూ ఉండడంతో ఇవన్నీ వాస్తు దోషమే అన్నట్లుగా భావిస్తున్నారని.. తాడేపల్లి లో అందుకు సంబంధించి చర్చలు కూడా జరిపి వాస్తు దోషాన్ని తరిమికొట్టేలా ఆ ఇంటి చుట్టూ ఉన్న ఇనుపకంచెలన వాస్తు దోషానికి అనుకూలంగా మార్చేలా చేస్తున్నారట.
ఇదివలే దక్షిణ దిశలో కంచెను తీసేసారట. అలాగే సోమవారం రోజున తూర్పు, ఈశాన్యంలో కొన్ని వరుసలను తీసివేశారట. తూర్పు ఈశాన్ని మూసివేయడం మంచిది కాదని వాస్తు పండితులు తెలియజేయడం తో ఈ దిద్దుబాటులను చేస్తున్నారని సమాచారం.. అయితే ఇలా జగన్ ఇంటికి వాస్తు మార్పులు చేయడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజలు ఎందుకు తిరస్కరించాలనే విషయం పైన వెతుక్కోకుండా ఇలాంటి వాస్తు దోషాలు చేస్తున్నారనే విధంగా విమర్శలు ఎదురవుతున్నాయి.. ఓటమి నేపాన్ని ఇంటి వాస్తు పైన నెట్టేస్తున్నారనే విధంగా పలువురు అధికార నేతలు కూడా విమర్శిస్తున్నారు. ఇదే ఇంట్లో ఉండగా 2019లో అధికారంలోకి వచ్చారని గుర్తు చేస్తున్నారట..