ఢిల్లీ ఎన్నికలను షేక్ చేయబోతున్న పుష్ప 2 !

Seetha Sailaja
గడిచిన వారం విడుదలైన ‘పుష్ప 2’ 1000 కోట్ల మార్క్ కు చేరువ అవుతూ ఉండటంతో బన్నీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో సమానంగా ఉత్తరాది రాష్ట్రాలలో ఈ మూవీకి వస్తున్న కలక్షన్స్ రేంజ్ ని చూసిన వారికి ఈ మూవీ ఫైనల్ కలక్షన్స్ ఏ స్థాయిలో ఉంటాయి అన్న అంచనాలు వేస్తూ ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు బిజీగా ఉన్నారు.

ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా తెలుగు రాష్ట్రాలలోని సినిమా ప్రేక్షకులతో సమానంగా ‘పుష్ప 2’ మ్యానియా ఉత్తరాది సినిమా ప్రేక్షకులకు ఏర్పడటంతో ఈ మ్యానియాను తమకు అనుకూలంగా రాబోతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మలుచుకోవాలని చాల రాజకీయ పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ‘ఆమ్ ఆద్మీ’ పార్టీ అధినేత కేజ్రీ వాల్ కు అత్యంత కీలకంగా మారనున్నాయి.

అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం కూడ రాబోతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ విజయాని ఇప్పటి నుండే తమ ప్రయత్నాలను కొనసాగిస్తూ ఢిల్లీ ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా భారతీయ జనతా పార్టీ కూడ గెలుపే లక్ష్యంగా తన వ్యూహాలను పదును పెడుతోంది. ఈ ప్రచారంలో భాగంగా కేజ్రీ వాల్ ‘పుష్ప 2’ మూవీలోని బన్నీ గెటప్ వేసుకుని దానికి సంబంధించిన ఫోటోలు పోస్టర్స్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఈ మూవీ సూపర్ సక్సస్ తో ‘పుష్ప 3’ చేయవచ్చని కొన్ని సంకేతాలు కూడ వస్తున్నాయి. బన్నీ సినిమాలు మళయాళంలో బాగా విజయవంతమైన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు బన్నీ క్రేజ్ ఉత్తరాది రాష్ట్రాలలో బాగా ఉండటంతో పాటు రాబోతున్న ఎన్నికలలో కేజ్రీ వాల్ అల్లు అర్జున్ డైలాగ్స్ అదేవిధంగా అతడి బాడీ లాంగ్వేజ్ అనుసరిస్తే అది జాతీయ మీడియాలో పెను సంచలనమే అవుతుంది. మరి ఢిల్లీ ఓటర్లు ‘పుష్ప 2’ మ్యానియాతో కేజ్రీ వాల్ కు ఎలాంటి తీర్పును ఇస్తారో చూడాలి..      

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: