2029 లో బీఆర్ఎస్ గద్దెనెక్కాలంటే కేసీఆర్ ఆ పనులు చేయాల్సిందే!

Pandrala Sravanthi
తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పగానే దేశమంతా టక్కున గుర్తుకు వచ్చేది కేసీఆర్ మాత్రమే.. అలాంటి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేయడానికి శత విధాల కృషి చేశారు. చివరికి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు.. అంతేకాదు రాష్ట్ర ప్రజలు కేసీఆర్ చేసిన మేలును మెచ్చి రెండుసార్లు అధికారాన్ని అందించారు. దాదాపుగా 9 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ఎన్నో అద్భుత పథకాలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించారు. కానీ మూడో దఫా ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ కి తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు.. కేసీఆర్ కిందిస్థాయి నాయకుల ఆగడాలు తట్టుకోలేక చివరికి కాంగ్రెస్ కి అధికారం అందించారు. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిపోయింది.. అయినా కాంగ్రెస్ చేస్తున్న తప్పులను మాత్రం ఎక్కడ కూడా కేసీఆర్ ఎత్తి చూపకుండా అధికారం పోయినప్పటి నుంచి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు..


 కాంగ్రెస్ గురించి తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం గురించి ప్రతిరోజు ప్రజలకు వినిపించేది పోయి సైలెంట్ గా ఉండడం వల్ల బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకు పలచన అయిపోతుంది.. అయితే రాబోవు రోజుల్లో బీఆర్ఎస్ గద్దెనెక్కాలి అంటే తప్పకుండా కేసీఆర్ ఈ పనులు చేయాల్సిందే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. మరి ఆయన ఏ ఏ పనులు చేస్తే బాగుంటుందో మనం తెలుసుకుందాం.. కేసీఆర్ రెండుసార్లు రాష్ట్రానికి సీఎం కాగానే ఆయనకు అహంకార భావం పెరిగిపోయింది.. కనీసం తన మంత్రివర్గంలో ఉండే మంత్రులు కూడా తనని కలవాలంటే చాలా ఇబ్బందులు పడేవారు.. ఇక సాధారణ ప్రజల  పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. కాబట్టి తనలో ఉన్న అహంకార భావాన్ని తగ్గించుకోవాలి.. అంతే కాదు ప్రతిక్షణం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్లాలి..


అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన న్యాయం చేయాలి.. మరీ ముఖ్యంగా ఫామ్ హౌస్ ను వదిలి ఆయన ప్రజా క్షేత్రంలోకి వస్తేనే 2026లో రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది. లేదంటే ఇక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కష్టమే అవుతుంది.. అంతేకాదు పార్టీని వదిలినటువంటి పాత నాయకులను కష్టపడ్డ వారిని మళ్లీ పార్టీలోకి తీసుకొని వారికి సముచిత స్థానం అందించాలి. దీనివల్ల పార్టీ బలపడి మళ్లీ అధికారంలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి చూడాలి కేసీఆర్ ఈ ఏడాదిలో అయినా  మార్పు తెచ్చుకొని ముందుకు వెళ్తారా లేదంటే అదే అహంకార భావంతో ఉంటారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: