టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటలలో ఒకరు అయినటువంటి సాయి కుమార్ కుమారుడు ఆది సాయి కుమార్ చాలా సంవత్సరాలు క్రితమే టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈయన ప్రేమ కావాలి అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన నటించిన లవ్ లీ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇలా వరుసగా రెండు విజయాలను అందుకున్న ఈయన ఆ తర్వాత మాత్రం వరుస పెట్టి అనేక సంవత్సరాలు అనేక భారీ ఆపజయాలను అందుకున్నాడు. ఇలా అనేక సంవత్సరాలు భారీ అపజయాలను ఎదుర్కొన్న ఆది సాయి కుమార్ తాజాగా శంభాల అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజే మంచి టాక్ వచ్చింది. దానితో ప్రస్తుతం ఈ సినిమాకు మంచి కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఆరు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. మరి ఈ ఆరు రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుందా ..? లేదా ..? అనే వివరాలను తెలుసుకుందాం.
ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఆరు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. 6 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 5.45 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లు దక్కగా ... 10.70 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమా దాదాపు 5 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరి లోకి దిగింది. దానితో ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమాకు మరికొన్ని రోజుల పాటు మంచి కలెక్షన్లు దక్కితే ఈ సినిమా మంచి లాభాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఏదేమైనా కూడా చాలా సంవత్సరాల తర్వాత శంభాల మూవీ తో ఆది సాయి కుమార్ కి మంచి సినిమా వచ్చింది అని చెప్పాలి. మరి ఈ సినిమా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.