తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటులలో విజయ్ సేతుపతి ఒకరు . ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో హీరో పాత్రలలో నటించి అద్భుతమైన విజయాలను అందుకోవడం మాత్రమే కాకుండా కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలలో , మరికొన్ని సినిమాల్లో కీలక ముఖ్య పాత్రల లో కూడా నటించి ప్రేక్షకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకున్నాడు . ఇకపోతే విజయ్ సేతుపతి ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించాడు.
కొంత కాలం క్రితం చిరంజీవి హీరోగా రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో విజయ్ ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ సినిమా ద్వారా విజయ్ కి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈయన పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడం , ఇందులో విజయ్ పాత్ర అద్భుతంగా ఉండడంతో ఈ సినిమా ద్వారా ఈయన క్రేజ్ తెలుగు లో మరింతగా పెరిగిపోయింది. ఇకపోతే విజయ్ కొంత కాలం క్రితమే మహారాజా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో విజయ్ క్రేజ్ మరింతగా పెరిగింది. ఇకపోతే విజయ్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్ గా ఉంటాడు. చాలా అరుదుగా ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఉంటాడు. ఇకపోతే విజయ్ తన ఇన్ స్టా లో కేవలం ఒకే ఒక హీరోయిన్ ను ఫాలో అవుతున్నాడు. ఆమె ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి అంజలి.
విజయ్ సేతుపతి తన ఇన్ స్టా అకౌంట్ నుండి ఫాలో అవుతున్న ఒకే ఒక ముద్దుగుమ్మ అంజలి మాత్రమే.