తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరిగా చాలా కాలం పాటు కెరీర్ను కొనసాగించిన వారిలో తేజ ఒకరు. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం తక్కువ బడ్జెట్ తో కొత్త నటీ నటులతో అనేక సినిమాలను తెరకెక్కించి అందులో చాలా మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. దానితో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది. ఇక కెరియర్ ప్రారంభంలో అనేక విజయాలను సొంతం చేసుకున్న ఈయన ఆ తర్వాత మాత్రం ఆ స్థాయి విజయాలను అందుకోవడంలో చాలా వరకు వెనకబడిపోయాడు.
ఇకపోతే ఆఖరుగా తేజ కి "నేనే రాజు నేనే మంత్రి" అనే సినిమాతో మంచి విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కింది. ఈ సినిమా తర్వాత కూడా ఈయన పలు సినిమాలకు దర్శకత్వం వహించగా ఆ సినిమాలు ఏవి కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే తేజ ఏ విషయంలో అయినా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడడం ద్వారా ఆయన కెరియర్ కు ఏమైనా ముప్పు వస్తుందా అనే దానిని కూడా ఆయన పెద్దగా పట్టించుకోడు. ఇకపోతే అలా ఆయన ఒక విషయంలో అనవసరంగా మాట్లాడడం వల్ల కోటి రూపాయలను ఫైన్ గా కట్టాడట. ఆ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
తేజ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... ఓ సినిమా విడుదల కాకముందే ఆ సినిమా ఆడదు అని ఫ్లాప్ అవుతుంది అని అన్నాడట. ఇక అలా సినిమా విడుదల కాకముందే ఆ మూవీ గురించి నెగటివ్ గా మాట్లాడటం వల్ల ఆయనపై కోటి రూపాయలు ఫైన్ విధించారట. దానితో ఆయన కూడా కోటి రూపాయల ఫైన్ కట్టాడట. అలా తన నోటి దూల వల్ల కోటి రూపాయలు ఫైన్ కట్టాను అని తేజ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.