ఆ సీన్‌ చూస్తే.. చంద్రబాబు సీఎం కావడం ఖాయం అనిపిస్తోందిగా.. అప్పుడే మొదలెట్టేశారా?

ఏపీలో జరిగిన ఎన్నికల్లో గతంలో ఎన్నడూ చూడని హింస ప్రజ్వరిల్లుతోంది. దీంతో అమాయకుల తలకాయలు కొబ్బరి కాయలు పగిలినట్లు పగులుతున్నాయి. అధికార, విపక్షం అనే తేడా లేకుండా దాడులకు తెగబడుతున్నారు. కొన్ని చోట్ల పోలీసులు సైతం ఏం చేయలేక మిన్నుకుండిపోయారు.  పోలింగ్ తర్వాత ప్రశాంత వాతావరణం చోటు చేసుకోవాల్సింది పోయి.. ఇప్పుడే గొడవలు ఎక్కువ అయ్యాయి.

ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. గతంలో చంద్రబాబు ఇంటిపై జోగి రమేశ్ దాడి చేయడం.. వెను వెంటనే అతనికి మంత్రి పదవి రావడం.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పై అవినాశ్ అండ్ టీం దాడి చేయడం ఆయనకు సైతం విజయవాడ ఈస్ట్ సీటును కేటాయించడం జరిగిపోయాయి.  దీంతో పాటు పలు సంఘటనలు టీడీపీ శ్రేణులను కలవర పాటుకి గురి చేశాయి.

వీరంతా పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం ఇప్పటి వరకు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత గవర్నర్ కు వెళ్లి వినతి పత్రాలు ఇవ్వడం, డీజీపీ దగ్గరకి వెళ్లి  మాట్లాడటం లాంటివి చేసేవారు. కానీ ప్రయోజనం మాత్రం శూన్యం. ఇప్పుడు ఎన్నికల సమయం. అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండవు. దీంతో పాత్ర అటు ఇటూ మారిపోయింది.

ప్రస్తుతం జరుగుతున్న దాడులకు టీడీపీయే కారణమని వైసీపీ నేతలు నేరుగా రాజ్ భవన్ కి వెళ్లి గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. దీపక్ మిశ్రా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మంత్రులు బొత్స  సత్య నారాయణ, మేరుగు నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, పేర్ని నాని, మోపిదేవి వెంకట రమణ.. తదితరులు గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసి పోలింగ్ తర్వాత టీడీపీ దాడులు పెచ్చుమీరాయని ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే దీపక్ మిశ్రా విచారణ చేపట్టకుండానే వైసీపీ వారిపై చర్యలు తీసుకుంటున్నారని.. అదే మేం చేస్తే వాటిపై స్పందిచడం లేదని అందులో పేర్కొన్నారు. ఇప్పుడు వైసీపీ నేతలు ఆర్తనాదాలు టీడీపీ నేతలకు వినసొంపుగా వినిపిస్తున్నాయి. అధికారం చేపట్టకముందే చంద్రబాబు వారిపై విజయం సాధించారని గర్వంగా చెబుతున్నారు. మొత్తానికి చంద్రబాబు సాధించారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: