ఏం పర్లేదు : రోజా ఓడినా..ఆ పదవి ఇవ్వనున్న జగనన్న ?

Veldandi Saikiran
మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరిగిన నేపథ్యంలో... ప్రతి ఒక్కరూ వీటి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఏపీలో ఎక్కడికి వెళ్లినా అసెంబ్లీ ఎన్నికలపై చర్చ చేస్తున్నారు. ఏపీలో ఏ పార్టీ గెలుస్తుంది అనే దానిపై బెట్టింగులు కూడా కాస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. శనివారం రోజున ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. దీంతో ఏపీ ఎన్నికల ఫలితాలపై ఒక క్లారిటీ వచ్చింది.

ఈ సారి ఫైట్ చాలా టైట్ గానే ఉన్నట్లు ఈ సర్వే సంస్థలు తెలిపాయి. కొన్ని సర్వే సంస్థలు వైసిపి పార్టీకి ఎడ్జ్ ఇస్తే... మరి కొన్ని సర్వే సంస్థలు మాత్రం తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఫలితాలను ఇచ్చాయి. అయితే ఏ సర్వే చూసినా... ఏ సర్వే ఫలితాన్ని గమనించిన... ఏపీ పర్యాటక శాఖ మంత్రి, ఫైర్ బ్రాండ్ రోజా ఓడిపోవడం గ్యారంటీ అని తేలిపోయింది. వైసిపి అధికారంలోకి వస్తుందన్న సర్వే సంస్థ కూడా... రోజా ఓడిపోవడం గ్యారంటీ అని చెబుతోంది.

నగరి నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ నాయకుల కారణంగా రోజా ఓడిపోతుందని... మొదటినుంచి ఓ ప్రచారం ఉంది. సర్వే సంస్థలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి.  ఏపీలో వైసీపీ పార్టీ  ఓడిపోయే మొదటి సీటు మంత్రి రోజా అని చెబుతున్నాయి ఈ సర్వే సంస్థలు. దీంతో అందరూ నిజంగానే వైసిపి మంత్రి  రోజా ఓడిపోతుందని చర్చించుకుంటున్నారు. అయితే రోజమ్మ ఓడిపోయిన కూడా... ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని సర్వేలు వెల్లడించాయి.  అంతేకాదు వైసీపీ అధికారంలోకి వస్తే.... ఖచ్చితంగా మంత్రి రోజాకు మరో పదవి జగన్మోహన్ రెడ్డి ఇస్తారని అంటున్నారు. ఎందుకంటే గత ఐదు సంవత్సరాలలో...  జగన్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా... అసెంబ్లీలో... తెలుగుదేశాన్ని చీల్చి చెండాడారు రోజా.

ఇప్పుడు అసెంబ్లీలో రోజా లేకపోతే... వైసిపికి చాలా కష్టం. కాబట్టి ఆమెకు ఎమ్మెల్సీ పదవి  ఇవ్వాలని కొంతమంది అంటున్నారు. ఆ దిశగా జగన్ కూడా ఆలోచిస్తారని చెబుతున్నారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆమెకు మంత్రి పదవి కూడా ఇస్తారని కొంతమంది వైసీపీ నేతలు చెబుతున్నారు. అలాగే నిత్యం మీడియా ముందుకు వెళ్లి...  పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబుపై విమర్శలు చేసేలా  అయినా ఒక పదవి ఇవ్వాలని కొంతమంది వైసిపి నేతలు డిమాండ్ చేస్తున్నారట. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక... కచ్చితంగా రోజాకు ఏదో ఒక పదవి వస్తుందని... ఆమె అనుచరులు మాత్రం ధీమాగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: