"గం గం గణేశా" ఓటిటి పాట్నర్ లాక్..?

MADDIBOINA AJAY KUMAR
బేబీ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ తాజాగా గం గం గణేశా అనే కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఉద‌య్ బొమ్మిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్ర‌గ‌తి శ్రీ‌వాస్త‌వ‌ , న‌య‌న్ సారిక హీరోయిన్ లుగా న‌టించారు. వెన్నెల కిషోర్ , ఇమ్మాన్యుయెల్ , రాజ్ అరుణ్ , స‌త్యం రాజేష్ తదితరులు ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. చేత‌న్ భ‌ర‌ద్వాజ్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించారు.

బేబీ లాంటి విజయవంతమైన సినిమా తర్వాత ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా బృందం వారు విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగి పోయాయి. అలా మంచి అంచనాల నడుమ మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి భారీ మొత్తంలో కాకుండా మామూలు స్థాయిలో కలెక్షన్ లు దక్కుతున్నాయి.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓ టీ టీ పార్టనర్ లాక్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ సినిమా యొక్క కొన్ని వారాల థియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ad

సంబంధిత వార్తలు: