"100% లవ్" లో మొదట హీరోగా అనుకున్న నటుడు ఎవరో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
నాగ చైతన్య హీరో గా తమన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో 100% లవ్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించారు. 2011 వ సంవత్సరం థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన కలక్షన్ లను వసూలు చేసి సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ ద్వారా నాగ చైతన్య , తమన్నా కు అద్భుతమైన గుర్తింపు లభించింది.

ఇకపోతే ఈ సినిమాలో మొదట హీరోగా నాగ చైతన్య ను కాకుండా మరో హీరో ను అనుకున్నారు. దాదాపు ఆ హీరో తోనే సినిమా చేయాలి అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో నాగ చైతన్య ను హీరోగా సెలెక్ట్ చేశారు. 100% లవ్ మూవీ లో మొదట అనుకున్న హీరో ఎవరు ..? అసలు ఎవరో ఏమి జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం.  దర్శకుడు సుకుమార్ "100% లవ్" అనే టైటిల్ తో ఒక యూత్ ఫుల్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కథను రెడీ చేసుకున్నారు. ఇక ఆ కథకు హీరో , హీరోయిన్ ఎవరు అయితే బాగుంటుంది అని వెతుకులాటలో ఈ కథకు వరుణ్ సందేశ్ హీరో గాను ,  తమన్నా హీరోయిన్ అయితే బాగుంటుంది అని ఓ నిర్ణయానికి సుకుమార్ వచ్చాడు.

ఇక ఇదే విషయాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్ అధినేత అయినటువంటి అల్లు అరవింద్ కు కూడా చెప్పగా , ఆయన కూడా వీరిద్దరూ అయితేనే బాగుంటుంది అని అనుకున్నారు. ఇక ఆల్మోస్ట్ ఈ కాంబోలో సినిమా సెట్ అయ్యింది అనుకునే సమయంలో ఎందుకో ఏమో తెలియదు కానీ వరుణ్ సందేశ్ ను హీరో స్థానం నుండి తీసేసి నాగ చైతన్య ను ఆ ప్లేస్ లో ఫిక్స్ చేశారు. అలా వరుణ్ సందేశ్ , తమన్నా జోడి గా అనుకున్న 100% లవ్ సినిమాను నాగ చైతన్య , తమన్నా జోడి గా తెరకెక్కించారు. ఇక ఈ మూవీ సూపర్ హిట్ విజయం సాధించడంతో నాగ చైతన్య కు మంచి గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

nc

సంబంధిత వార్తలు: