మనల్ని ఎవడ్రా ఆపేది.. పవన్ కళ్యాణ్‌లో పెరిగిన ఉత్సాహం..??

Suma Kallamadi
జూన్ 1న సార్వత్రిక ఎన్నికల చివరి దశ ఓటింగ్ ముగిసిన వెంటనే, ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఇవి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. భారత దేశ ప్రజలందరూ తమ టీవీలు, ఫోన్లకు అతుక్కుపోయి మరీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వీక్షించారు. జూన్ 4న విజయం సాధించేది ఎవరో ఈ పోల్స్ ద్వారా ఒక ఐడియా వస్తుందని ఆశతో చూశారు. అన్ని సర్వేలు జాతీయ స్థాయిలో బీజేపీ విజయం సాధిస్తుందని అంచనా వేసాయి. చాలా వరకు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్‌డీఏ కూటమి గెలుస్తుందని చెప్పాయి.
టీడీపీ కూటమి గెలుపులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకపాత్ర పోషిస్తారని చెప్పవచ్చు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్‌ తెలిసి చెప్పడంతో జనసేన కార్యకర్తలు, మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ అసెంబ్లీలో సీటు సాధిస్తారని ప్రముఖ సైఫాలజిస్ట్ ఆరా మస్తాన్ ప్రకటించారు. ఈ ప్రకటన జనసేన అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా తనని ఎవర్రా ఆపేది అంటూ చాలా ఉత్సాహంతో ఊగిపోతున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.
జగన్‌ను గద్దె దించేందుకు టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీలు ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, ఎన్డీయే కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో 110 సీట్లకు పైగా గెలుపొందుతుందని, పార్లమెంటు ఎన్నికల్లో 18 సీట్లకు పైగా కైవసం చేసుకునే అవకాశం ఉంది. మొత్తం 175 స్థానాల్లో టీడీపీ 144 స్థానాల్లో, జనసేన 21 స్థానాల్లో, బీజేపీ 10 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి.
2019లో 1 నుంచి 2024లో 15కి పైగా సీట్లు పెరుగుతాయని ఈ సర్వేలు చాలా వరకు అంచనా వేస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేల ప్రకారం, జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ మంచి పనితీరు కనబరిచింది. 21 సీట్లలో జనసేన 75 శాతానికి పైగా గెలుస్తుందని అంచనా. అదనంగా, రెండు ఎంపీ స్థానాలను బలమైన మెజారిటీతో గెలుచుకోవడం ఖాయమట.
ఈ అంచనాలకు వాస్తవ ఫలితాలు సరిపోలితే ప్రభుత్వ ఏర్పాటులో జనసేన కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. మొత్తం మీద ఫలితం ఎలా ఉన్నా, ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సీటుతో సహా 15 కంటే ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుని, రెండు ఎంపీ స్థానాలను గెలుచుకుంటే జనసేన మద్దతుదారులు సంతోషిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: