"పాత్రల కోసం వెంపర్లాడే స్ధాయి"..రష్మిక ఘాటు కౌంటర్ ఆ సొట్ట బుగ్గల హీరోయిన్ కేనా..?

Thota Jaya Madhuri
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ భామ, వరుస సినిమాలతో తన స్టార్ డమ్‌ను అమాంతం పెంచుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ భాషా భేదం లేకుండా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను క్రియేట్ చేసుకుంది.ప్రస్తుతం రష్మిక కెరీర్ గ్రాఫ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఒకప్పుడు అవకాశాల కోసం ప్రయత్నాలు చేసిన ఈ చిన్నది, ఇప్పుడు వరుస ఆఫర్లతో బిజీగా మారింది. ఆమె రేంజ్ ఇప్పుడు ఆ స్థాయికి చేరుకుంది అంటే, నిర్మాతలు, దర్శకులు స్వయంగా కథలు తీసుకొచ్చి ఆమె డేట్స్ కోసం వెయిట్ చేసే పరిస్థితి నెలకొంది.



ఇటీవల ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రష్మిక, ప్రస్తుతం ‘కాక్‌టెయిల్’, ‘మైసా’ వంటి విభిన్నమైన కథాంశాలున్న చిత్రాల్లో నటిస్తోంది. ముఖ్యంగా ఆమె పాత్రల ఎంపికలో చూపుతున్న మార్పు, ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తోందనే చెప్పాలి.ఇదిలా ఉండగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మందన్న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… “నటిగా ప్రతి సినిమాతో నా మీద బాధ్యత పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు పాత్రల కోసం వెంపర్లాడే స్థితిలో ఉండేదాన్ని. కానీ ఇప్పుడు మంచి పాత్ర కోసం ఆరాటపడే స్థాయికి వచ్చానని అనుకుంటున్నాను. డబ్బు కోసం మాత్రమే సినిమాలు చేసే రోజులు దాటిపోయాయి. ప్రస్తుతం నా కోసం రచయితలు ప్రత్యేకంగా కథలు రాస్తున్నారు. ఒక విధంగా ఇది నా విజయం అని చెప్పుకోవచ్చు. ఫలానా తరహా పాత్రలే చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈ విషయంలో నాకు నేను కంటే రచయితలపైనే ఎక్కువ నమ్మకం ఉంటుంది. నాకు సూటయ్యే పాత్రలనే వారు నా దగ్గరకు తీసుకువస్తారని నమ్ముతున్నాను” అని చెప్పుకొచ్చింది.ఈ వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో రష్మిక అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు కొంతమంది నెటిజన్లు మాత్రం ఈ మాటలను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు మరో యంగ్ హీరోయిన్‌ను ఉద్దేశించి చేసిన ఘాటు కౌంటర్‌లా ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.



“సొట్ట బుగ్గల హీరోయిన్‌ను టార్గెట్ చేసేలా ఈ మాటలు ఉన్నాయా?” అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. రష్మిక ఈ వ్యాఖ్యలు తెలిసి చేసిందా? లేక సహజంగా తన కెరీర్ గురించి మాట్లాడిందా? అనే విషయంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కొంతమంది మాత్రం రష్మిక తన వ్యక్తిగత ప్రయాణాన్ని మాత్రమే వివరించిందని, ఇందులో ఇతర హీరోయిన్లను కించపరిచే ఉద్దేశం ఏమాత్రం లేదని అంటున్నారు. కానీ మరికొందరు మాత్రం “ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యంగ్ హీరోయిన్లను తగ్గించి మాట్లాడినట్లుగా ఉంది” అంటూ విమర్శలు చేస్తున్నారు.



ఏది ఏమైనా, రష్మిక మందన్న చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ట్రోల్స్, డిబేట్స్, మీమ్స్‌తో ఈ విషయం మరింతగా హైలైట్ అవుతోంది. ఒక స్టేట్‌మెంట్ ఎంత పెద్ద చర్చకు దారి తీస్తుందో చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇక రష్మిక విషయానికి వస్తే—ఆమె తన కెరీర్‌పై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ముందుకు సాగుతోంది. పాత్రల ఎంపికలో క్వాలిటీకి ప్రాధాన్యం ఇస్తూ, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తన స్థానాన్ని మరింత బలపరుస్తోంది. ఈ ట్రోల్స్ అన్నీ తాత్కాలికమేనని, తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్లడమే లక్ష్యంగా రష్మిక కొనసాగుతోందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.మరి ఈ వ్యాఖ్యలు నిజంగా ఎవరికైనా కౌంటర్‌లా వచ్చాయా? లేక ఇది కేవలం రష్మిక కెరీర్ గ్రోత్‌ను ప్రతిబింబించే మాటలేనా? అన్నది మాత్రం కాలమే తేల్చాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: