స్టార్ హీరోయిన్ కావలసిన బ్యూటీ కెరియర్ ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో.. స్పెషల్ సాంగ్ చేసిన నో యూస్..?

Pulgam Srinivas
ప్రతి సంవత్సరం సినిమా పరిశ్రమలోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అందులో కొంత మంది కి ఎంట్రీ ఇచ్చిన కొత్త లోనే అద్భుతమైన క్రేజ్ దక్కుతూ ఉంటుంది. దానితో అలాంటి వారు చాలా తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటారు అనే ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. అలాంటి వారిలో కొంత మంది ఆ స్థాయికి చేరుకోకుండా కెరియర్ను ముందుకు సాగిస్తూ ఉంటారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఇలాంటి ఓ నటి ఉంది. ఈమె తెలుగు సినీ పరిశ్రమలోకి ఇచ్చిన కొత్త లోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది.


దానితో ఈమె చాలా తక్కువ కాలం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆమె ఆ స్థాయికి వెళ్లలేదు. కొంత కాలం క్రితం ఆ బ్యూటీ ఓ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది. కానీ ఆ సాంగ్ వల్ల కూడా ఈమెకు పెద్దగా క్రేజ్ దక్కలేదు. ఇంతకు ఆ నటిమని ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటువంటి రెజీనా. ఈమె చాలా సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చిన కొత్త లోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి సినిమాలలో అవకాశాలు వచ్చాయి.
 


ఈమె నటించిన సినిమాలలో చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈమె క్రేజ్ తగ్గుతూ వచ్చింది. కొంత కాలం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య మూవీ లో ఈమె ఐటమ్ సాంగ్లో నటించింది. ఈ సాంగ్ కి మంచి క్రేజ్ వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ కావడంతో ఈ సాంగ్ ద్వారా కూడా రెజీనా కి పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఈమె పరవాలేదు అనే స్థాయి క్రేజ్ ఉన్న సినిమాలలో నటిస్తూ మంచి దశలోనే కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: