ఏపీ: వార్ వన్ సైడ్ కాదు.. జగన్, బాబు అలర్ట్..!

Divya
ఆంధ్రప్రదేశ్లో అధికారం దక్కేది ఎవరికనే విషయం ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పలేకపోయాయి.. చాలా ఎగ్జిట్ పోల్స్ సైతం రెండు వైపులా పార్టీలకు అనుకూలంగానే చెప్పినట్టుగా కనిపిస్తోంది. ఇదే సమయంలో మరికొన్ని కీలక అంశాలు కూడా ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టినట్లుగా కనిపిస్తోంది. కౌంటింగ్ వేళ ఈ హెచ్చరికలు అటు జగన్కు చంద్రబాబుకు డేంజర్ బెల్స్  గా మారనున్నాయి. దీంతో చాలామంది తుది ఫలితం పైన కూడా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఫలితాలు ఏకపక్షం కాదని ఎగ్జిట్ పోల్స్ చాలా క్లియర్ కట్టుగా తేల్చేశాయి.

ఏ ఒక్కరు కూడా ప్రచారం చేసుకుంటున్నట్లుగా గెలిచే పరిస్థితి కనిపించడం లేదని కౌంటింగ్ లో కూడా అనూహ్య పలితాలు వస్తాయని సంకేతాలు కనిపిస్తున్నాయి.. వైసీపీ పార్టీ గెలుస్తుందని తెలిపిన సంస్థలలో 120 సీట్లు గరిష్టంగా సంఖ్య మాత్రమే ఉన్నది. అయితే అమలు చేసిన సంక్షేమ ఇతరత్రా కార్యక్రమాల వల్ల ఇవి వర్కౌట్ అవుతాయని జగన్ పూర్తిగా ధీమాతో ఉన్నారు. అయితే ఫలితాలలో మాత్రం ఆ మద్దతు ఎక్కడ ఎక్కువగా కనిపించలేదు. అంతేకాకుండా పలువురు మంత్రులు కూడా ఓటమి బాటపడుతారని తెలియజేశాయి.

జగన్ దాదాపుగా 80 మంది అభ్యర్థులను సైతం మార్చారు. అలాగే మేనిఫెస్టోలో కూడా పెద్దగా మార్పులు చేయలేదు.. కాబట్టి జగన్ లెక్కలు అర్బన్ ప్రాంతాలలో దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. మహిళలు లబ్ధిదారులు మాత్రమే జగన్కు మద్దతు వేసినట్లుగా సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు టీమ్ కూడా కేవలం పూర్తిగా జగన్ వ్యతిరేకత ఓటు పైనే ఆధారపడి ఉన్నట్లుగా తెలుస్తోంది మేనిఫెస్టో ప్రజలను ఒప్పించే ప్రయత్నం మాత్రం అసలు ఎక్కడ చేయలేదు? డెవలప్మెంట్ రాజధాని అంశంలో కూడా చంద్రబాబుకు అంతగా అనుకూలించినట్లుగా కనిపించలేదు. గ్రామీణ ప్రాంతంలో జగన్కు ఆశించిన స్థాయిలో చంద్రబాబు ఆపోజిట్ గా నిలవలేక పోతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇవే కాకుండా మరికొన్ని అంశాలు కూడా కూటమిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అందుకే తుది అంశం పైన చాలా ఉత్కంఠత పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: