ఓటిటిలో జోష్ చూపిస్తున్న ప్రసన్న వదనం... ఏకంగా అన్ని వ్యూస్..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి సుహాస్ తాజాగా ప్రసన్న వదనం అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి సుకుమార్ శిష్యుడు అర్జున్ వై కే దర్శకత్వం వహించగా ... పాయల్ రాధాకృష్ణ , రాశి సింగ్ , నందు , హర్ష చెముడు , నితిన్ ప్రసన్న తదితరులు ఈ మూవీ లో కీలక పాత్రల్లో నటించారు.
 

మణికంఠ , ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించారు. ఇకపోతే ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో మంచి కలెక్షన్ లను వసూలు చేసి డీసెంట్ విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇకపోతే ఈ సినిమాకు ఓ టీ టీ ప్రేక్షకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇక తాజాగా ఆహా ఓ టీ టీ సంస్థ వారు ప్రసన్న వదనం సినిమా ఇప్పటి వరకు 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియా లో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయిన ఈ సినిమా ఆ తర్వాత ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సూపర్ సాలిడ్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: