దేవర : ఆ టాక్ ముందే ఊహించి అలాంటి పని చేశారా..?

MADDIBOINA AJAY KUMAR
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ నిన్న విడుదల అయ్యింది. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయిన బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకుంది. అయినప్పటికీ ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు భారీ ఎత్తున కలెక్షన్లను రాబట్టింది. ఇకపోతే ఆర్ ఆర్ ఆర్ లాంటి అద్భుతమైన విజయవంతమైన సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై మొదటి నుండి ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తూ ఉండడం , కొరటాల శివ ఈ మూవీ కి దర్శకత్వం వహించడం , బాలీవుడ్ నటి జాన్వి కపూర్ ఈ సినిమాతోనే హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం కావడం , అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ ఈ మూవీ లో ప్రధాన ప్రతి నాయకుడు పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి.

అలా ఈ మూవీ పై అంచనాలు భారీగా ఉండడంతో ఈ సినిమాను అత్యంత భారీ ధరకు అమ్ముతారు అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ మూవీ బృందం మాత్రం ఈ సినిమాను కేవలం 180 కోట్ల ధరకే అమ్మి వేసింది. దానితో ఈ మూవీ కి బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే భారీ ఎత్తున లాభాలు రావడం ఖాయం అని చాలా మంది జనాలు భావించారు. కానీ ఈ మూవీ కి మిక్స్ డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ మూవీ ని 180 కోట్లకు అమ్మి మేకర్స్ చాలా మంచి పని చేశారు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఎందుకు అంటే ఈ మూవీ కి వచ్చిన టాక్ కి అత్యంత భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం లేదు అని , ఎక్కువగా ధరకు అమ్మితే ఈ మూవీ ద్వారా నిర్మాతలకు నష్టం వచ్చే అవకాశం ఉండేది అని కొంత మంది జనాలు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: