ఆ బ్లాక్ బస్టర్ మూవీ కంటే పెద్ద హిట్ అవుతుంది.. శర్వానంద్..!?

Anilkumar
యూత్ కి బాగా నచ్చే హీరోల్లో శర్వానంద్ కూడా ఒకరు. టాలీవుడ్ లో ఇప్పుడున్న టైర్ 2 హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న శర్వానంద్ సినిమా సెలక్షన్ బాగున్నప్పటికీ ఆ సినిమాలు పెద్దగా విజయాన్ని సాధించడం లేదు. కానీ ఆయన చేసే సినిమాలు ఇటు యూత్ మరియు అటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా నచ్చుతాయి. అందుకే శర్వానంద్ కి ఫ్యామిలీ హీరో అన్న బిరుదు కూడా ఇచ్చారు ఆయన అభిమానులు. ఇక శర్వానంద్ సైతం ఎప్పుడూ యూత్ అండ్ ఫ్యామిలీని ఎంటర్టైన్ చేసే సినిమాలనే చేస్తూ పోతాడు. చివరిగా శర్వానంద్

 ఒకే ఒక జీవితం అని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా మదర్ సెంటిమెంట్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చింది. ఇదిలా ఉంటే ఇక శర్వానంద్ కెరియర్ మొత్తంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సినిమా ఏదైనా ఉంది అంటే శతమానంభవతి. ఇక ఈ సినిమా అప్పట్లో విడుదల దాదాపుగా 35 కోట్లకు పైగానే కలెక్షన్స్ను రాబట్టింది. ఇక ఈ సినిమా తర్వాత శర్వానంద్ చాలా సినిమాలు చేశాడు. కానీ శతమానం భవతి సినిమా రేంజ్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా ఆడలేదు. అయితే తాజాగా ఇప్పుడు

 మనమే అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శర్వానంద్. ఇందులో భాగంగానే తాజాగా సినిమాకి సంబంధించిన టీజర్ ఇంకా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.  ఇందులో భాగంగానే ఇప్పుడు మనమే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు చిత్ర బృందం.  తాజాగా ప్రమోషన్స్ భాగంలో శర్వానంద్ మాట్లాడుతూ..  మనమే’ సినిమాని నా టీం అంతా చూడటం జరిగింది. సినిమా చూసిన వాళ్ళందరూ సూపర్ అని చెప్పారు. ఈసారి పక్కాగా హిట్ కొడతానని చెబుతున్నా.. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ‘శతమానం భవతి’ రేంజ్లో ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు శర్వానంద్..  దీంతో ప్రస్తుతం శర్వానంద్ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: