క్రికెట్.. బేస్ బాల్ కి మధ్య తేడా ఏంటో చెప్పిన యువరాజ్ సింగ్?

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురుచూసిన వరల్డ్ కప్ టోర్ని నేటి నుంచి జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యూఎస్ వెస్టిండీస్ వేడుకలుగా.. ఈ ప్రపంచకప్ టోర్ని జరుగుతూ ఉండడం గమనార్హం. ఏకంగా 20 టీమ్స్ ఈసారి ఈ ఐసీసీ ఈవెంట్లో పాల్గొనబోతున్నాయి. అయితే అటు క్రికెట్ కి తక్కువగా ఆదరణ ఉండే అమెరికాలో ప్రపంచకప్ టోర్ని నిర్వహిస్తూ ఉండడంతో అక్కడ ప్రేక్షకాదరణ ఎలా ఉంటుంది అనే విషయంపై ఆసక్తి నెలకొంది అని చెప్పాలి. కాగా నేడు మొదటి మ్యాచ్ లో భాగంగా..  అమెరికా, కెనడా దేశాల మధ్య మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి.

 సాధారణంగా అమెరికాలో బేస్బాల్ ఆటకి ఎక్కువ క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే క్రికెట్ కూడా బేస్ బాల్ ఆటను పోలి ఉంటుంది  ఈ క్రమంలోనే అక్కడి క్రీడాభిమానులు అందరూ కూడా బేస్బాల్ తో పాటుగానే క్రికెట్ ను కూడా ఎక్కువగా ఆదరించే అవకాశం ఉంటుంది అని ఎంతోమంది విశ్లేషకులు నమ్ముతున్నారు. అయితే ఇటీవలే ప్రపంచ కప్ టోర్న నిర్వహించడం పై భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు  అమెరికాలో ఇలా క్రికెట్ ఆడతారని అస్సలు ఊహించలేదు. చూసేందుకు చాలా ఆసక్తిగా ఉంది. icc ఇక్కడ కొత్తగా రెండు స్టేడియాలను నిర్మించింది.అమెరికన్లు ఎక్కువగా క్రికెట్ చూడాలనుకోవడం నాకు నచ్చింది.

 అయితే ఇక్కడ ఎక్కువగా బేస్ బాల్ ఇష్టపడతారు. నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. అమెరికన్ ఫ్రెండును కలిసిన ప్రతిసారి కూడా అతను ఒకటే ప్రశ్న అడిగేవాడు. క్రికెట్ అంటే ఏంటి అని అడుగుతూ ఉండేవాడు. అయితే ఇది బేస్ బాల్ లా ఉంటుందని చెప్పాను. అయితే మీరు అక్కడ రన్ కోసం నాలుగు వైపులా పరుగులు పెడతారు. క్రికెట్లో మాత్రం కేవలం ముందుకు వెనక్కి మాత్రమే పరుగులు చేస్తాం. స్టేడియం బయటికి కొడితే బేస్బాల్ హోమ్ రన్ అని పిలుస్తారు. క్రికెట్లో మాత్రం స్టేడియం బయటికి కొడితే సిక్స్ అని అంటాం అని తన స్నేహితుడికి ఎప్పుడు క్రికెట్ గురించి చెబుతూ ఉండేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు యువరాజ్ సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: