జైల్లో ఫోన్ వాడుతున్న ఖైదీలు.. పోలీసులు ఏం చేశారంటే?

praveen
సాధారణంగా మనం సినిమాల్లో కొన్ని కొన్ని ఘటనలు చూస్తూ ఉంటామ్. అలాంటి ఘటనలే అటు నిజ జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలా సినిమాల్లో చూపించే కొన్ని జైలు సన్నివేశాలు రియల్ లైఫ్ లో కూడా జరుగుతూ ఉంటాయి. చాలామంది నేరస్తులు ఏకంగా పోలీసు అధికారులకు కనిపించకుండా మొబైల్ ఫోన్స్ వాడటం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే జైలులో శిక్ష అనుభవిస్తూనే మొబైల్ ఫోన్ ద్వారా బయట ఉన్న వ్యక్తులను బెదిరించడం ఇక దందాలను కొనసాగించడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు నేరస్తుల వద్ద మొబైల్ ఫోన్స్ అధికారులు గుర్తించినప్పుడు ఈ విషయం బయటకు వస్తూ ఉంటుంది.

 అయితే సాధారణ జైల్లోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఆసియాలోనే అతిపెద్ద జైలుగా పేరుగాంచిన తీహార్ జైల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏకంగా పెద్ద పెద్ద నేరస్తులను తీహార్ జైలుకు తరలించడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా తీహార్ జైల్లో శిక్షలు అనుభవించే ఎంతోమంది గ్యాంగ్ స్టర్లు ఇక జైలు నుంచే కొన్ని బయటి లావాదేవీలను కొనసాగించడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి ఇలాంటివి గమనించిన అధికారులు ఇక ఖైదీల ఆట కట్టించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారూ.

 తీహార్ జైల్లో ఖైదీలు ఫోన్లు వినియోగించడం ఎక్కువైపోయిందని గమనించిన అధికారులు.. దీనిని అరికట్టేలా చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఏకంగా 11.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ భారీ వ్యయంతో ఏకంగా జైలులో 15 సిగ్నల్ జామర్లను ఏర్పాటు చేయబోతున్నారు అధికారులు. అయితే ఇప్పటికే తీహార్ జైల్లో కాల్ బ్లాకింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఢిల్లీలోని చాణిక్యపురి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో తీహార్ గ్రామంలో ఉండే ఈ జైలు ఆసియాలోనే అతిపెద్దది. గత కొన్నేళ్లలో ఇక్కడ శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్ స్టర్లు ఏకంగా బయట ఉన్న వ్యక్తులను ఫోన్ల ద్వారా బెదిరించడం లాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: