రోడ్డుపై నడుస్తున్న చిన్నారి.. అంతలో అక్కడికొచ్చిన వీధి కుక్కలు.. చివరికి?

praveen
కుక్కలకి, మనుషులకి మధ్య ఈ మధ్యకాలంలో  పుట్టుకతోనే వైరం ఏర్పడుతుందా? ఇదే అనుమానం ప్రతిఒకరిలో కూడా కలుగుతుంది. దీనికి కారణం నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలే. ఒకప్పుడు మనుషులకి కుక్కలకి మధ్య బంధం ఎంతో ప్రత్యేకంగా ఉండేది. ఇక యజమానుల పట్ల కుక్కలు ఎంతో విశ్వాసంగా ఉండేవి. ఇక ఇటీవల కాలంలో కూడా ఎంతోమంది ఇక ఇష్టమైన బ్రీడ్ కుక్కలను తెచ్చుకుని ఇంట్లో మనిషిలాగా పెంచుకుంటూ ఉండటం చూస్తూ ఉన్నాం. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఏకంగా వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి.

 మనుషులను చూస్తే చాలు బద్ధ శత్రువులను చూసామేమో అన్నట్లుగా వీధి కుక్కలు కోపంతో రగిలిపోతున్నాయి. ఈ క్రమంలోనే దారుణంగా మీద పడి దాడి చేస్తూ ఉన్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే ఇలా కేవలం ఒక్క రాష్ట్రంలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కుక్కల దాడిలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే అభం శుభం తెలియని చిన్నారులను కూడా వీధి కుక్కలు వదిలేయడం లేదు. కదారుణంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. దీంతో ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు రోడ్డుపై కుక్కలు కనిపించాయి అంటే చాలు అటువైపు వెళ్లాలి అంటేనే ప్రతి ఒక్కరు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.

 ఇక ఇటీవలే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ చిన్నారిపై వీధి కుక్కల గుంపు దాడి చేసింది. అయితే ఆ కుక్కల నుంచి చిన్నారి తప్పించుకునే ప్రయత్నం చేసిన వదలకుండా.. పాప చుట్టూ రౌండప్ చేసి మరి దాడి చేశాయి వీధి కుక్కలు. అయితే పాప అరుపులు విన్న అక్కడే ఉన్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఆ కుక్కలను తరిమేసాడు. దీంతో ఆ చిన్నారిపై దాడి చేస్తున్న వీధి కుక్కల గుంపు పారిపోగా.. పాప ప్రాణాలతో బయటపడగలిగింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే పిల్లలను ఎప్పుడూ కూడా ఇలా బజారులోకి ఒంటరిగా పంపించకూడదని.. ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయని అటు అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: