గ్రూప్ - 4 లో తక్కువ మార్కులు.. యువతి చేసిన పనికి అందరూ షాక్?

praveen
నేటి ఆధునిక సమాజంలో మనిషి జీవన శైలిలో ఎంతలా మార్పులు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రతి పనిని కూడా సులభతరం చేసుకుంటున్నారు. అంతేకాదు ఒకప్పటిలా ఇక చదువుల్లో ఆడవారు మగవారు అని ఉన్న వివక్షకుడా నేటి రోజుల్లో కనిపించడం లేదు. ఏకంగా ఆడవారూ సైతం మగవారితో సమానంగా కాదు కాదు మగవారి కంటే ఎక్కువగానే ర్యాంకులు తెచ్చుకోవడం కూడా నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాం. ఇలా నేటి ఆధునిక సమాజంలో వచ్చిన మార్పు అంతా బాగానే ఉంది. కానీ ఎందుకో నేటి సమాజంలో అటు మనిషిలో.. విచక్షణ జ్ఞానం మాత్రం తగ్గిపోతుందేమో అనే భావన ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది.

 ఎందుకంటే ఏ విషయంలో కూడా విచక్షణ జ్ఞానంతో ఆలోచించడం లేదు. మరీ ముఖ్యంగా పరీక్షల మార్కుల విషయంలో అయితే ఇలాంటి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నారు. చివరికి కఠిన నిర్ణయం తీసుకొని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయి అన్న కారణంతో ముందు వెనక ఆలోచించకుండా క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేస్తున్నారు ఎంతోమంది విద్యార్థులు. ఇలా విద్యార్థులు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు పిల్లల మీదే ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు కడుపు కోతను మిగులుస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

 ఇక్కడ ఇలాంటి ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల గ్రూప్ ఫోర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.  అయితే ఈ పరీక్షల ఫలితాలలో తక్కువ మార్కులు వచ్చాయి అన్న ఆవేదనతో చిక్కడపల్లి పిఎస్ పరిధిలో ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. జవహర్ నగర్ లో ఒక హాస్టల్లో ఉంటున్న శిరీష అనే 24 ఏళ్ల యువతి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఇక ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే శిరీష స్వస్థలం మహబూబాబాద్ జిల్లా ముప్పారం గ్రామంగా తెలుస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇక లేదు అన్న విషయం తెలిసి అరణ్యరోదనగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: