ప్రేమిస్తున్నానని దగ్గరయ్యాడు.. కానీ ఆ తర్వాతే నిజం బయటపడింది?

praveen
ప్రేమ అంటే ఎన్నో మధురానుభూతుల సమ్మేళనం.. రెండు మనసులు కలయిక.. జీవితాంతం కలిసి మెలిసి సంతోషం గా ఉంటాం అనే నమ్మకాన్ని ఇచ్చే ఒక బంధం.. ఇలా ప్రేమ గురించి చెప్పుకుంటూపోతే ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ నేటి రోజుల్లో ప్రేమకు ఒక నిర్వచనం ఇవ్వాలి అంటే అవసరాలు తీర్చుకోవడానికి అక్కరకు గుర్తుకు వచ్చే ఒక ఆయుధం మాత్రమే అనేది ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు. ఎందుకంటే నేటి రోజులు స్వార్థపూరిత ప్రేమలే ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉన్నాయి.

 ఏకంగా కొంతమంది ఆర్థిక అవసరాలు తీర్చుకోడానికి ప్రేమ అనే నాటకం ఆడుతూ ఉంటే.. ఇంకొంతమంది శారీరక అవసరాల కోసం ప్రేమ అనే ముసుగు వేసుకొని మంచి వాళ్ళలా ప్రవర్తిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇలాంటి స్వార్థపూరిత ప్రేమలు ఎంతోమంది చివరికి మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం అవుతూ ఉన్నాయి. ఇంకెంతోమంది  జీవితాలను నాశనం చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్ కు చెందిన 23 ఏళ్ల యువతి జూబ్లీహిల్స్ శ్రీకృష్ణ నగర్ లో నివాసం ఉంటుంది.

 అయితే అక్కడే నివాసం ఉండే కర్ణాటక కు చెందిన  యాసిన్ భాషాతో ఆమెకు మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఇక తరచూ మాట్లాడుతూ ఉండడం.. ఒకరి ఇష్టాలు ఒకరికి నచ్చడంతో ఇక వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఈ క్రమంలోనే యువతని ప్రేమించానని పెళ్లి చేసుకుంటాను అంటూ దగ్గరయ్యాడు యాసిన్ భాష. అయితే అతనికి అప్పటికే పెళ్లయిందని తెలుసుకున్న యువతి అతన్ని దూరం పెట్టింది. కానీ అతను మాత్రం తనను పెళ్లి చేసుకోవాలి అంటూ యువతిని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో వేధింపులు తట్టుకోలేకపోయిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: