అయోధ్య రాముడు- చంద్రబాబు భావోద్వేగం?

Chakravarthi Kalyan
అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు హాజరైన తెలుగు దేశం అధినేత చంద్రబాబు తన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో పాల్గొనటం సంతోషం గా ఉందన్న చంద్రబాబు.. ప్రపంచ వ్యాప్తంగా నిండి ఉన్న శ్రీరాముడి వారసత్వ విశ్వాసాల్లో నేను భాగస్వామిని అయ్యానని సంతోషం వ్యక్తం చేశారు. శ్రీరాముడు మతాలకు, భౌగోళిక సరిహద్దులకు అతీతమన్న చంద్రబాబు.. రామ మందిరం కేవలం దేవాలయమే కాదు, మన దేశ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక మైలురాయిగా వర్ణించారు.

శ్రీరాముడు మూర్తీభవించిన అన్ని విలువలకు నివాళి అన్న చంద్రబాబు.. అయోధ్యలో పండుగ స్ఫూర్తి ఆశీర్వాదం నేను పొందానని తెలిపారు. అందరి మధ్య మరింత ఐక్యతను పెంపొందిస్తూ, ఈ పవిత్రోత్సవం మన దేశానికి కొత్త శకానికి నాంది పలుకుతోందని తెలుగు దేశం అధినేత చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: