పోలవరం వివాదంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సానుకూలంగా స్పందించారు. తెలుగు ప్రజలమైన మనమంతా సోదరులమన్న మంత్రి అంబటి రాంబాబు.. 5 గ్రామాలు మాకు ఇచ్చేయమని ఇప్పుడు కొంతమంది మాట్లాడటం భావ్యం కాదన్నారు. అలాంటివి ఏమైనా ఉంటే, వెళ్ళి కేంద్రాన్ని అడగాలని మంత్రి అంబటి రాంబాబు సూచించారు. భద్రాచలం మాది అంటే మీరు ఇస్తారా అని ప్రశ్నించిన మంత్రి అంబటి రాంబాబు.. సెటిల్ అయిపోయినవాటిని ఎందుకు మళ్ళీ లేపుతున్నారని ప్రశ్నించారు. ఈ వివాదం వల్ల రాజకీయంగా ప్రయోజనం ఏమీ ఉండదన్న మంత్రి అంబటి రాంబాబు.. లాజిక్, రీజన్, ధర్మం ఉంటే.. వివాదం చేయవచ్చు కానీ, లేని వివాదాలను రాజేయడం భావ్యం కాదన్నారు.
ఏపీలో విలీనం చేసిన 7 మండలాల ముంపు గ్రామాలకు పునరావాసం కల్పిస్తామని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును తొందరలోనే పూర్తి చేస్తామని.. కానీ డేట్ చెప్పలేమని అన్నారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు అన్న మంత్రి అంబటి రాంబాబు.. దశల వారీగానే ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. ఒకేసారి 50 లక్షల క్యూసెక్కులను స్పిల్ వే నుంచి విడుదల చేయగలిగే ప్రాజెక్టు పోలవరం ఒక్కటేనని.. ఇలాంటిది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది ఒక్క పోలవరం ప్రాజెక్టని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.