6 నెలలు ఆ హీరోయిన్ వెంటపడ్డ ఆ దర్శకుడు..చివరకు ?
విక్టరీ వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకు హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమానే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నువ్వు నాకు నచ్చావ్ సినిమా అనంతరం ఆర్తి అగర్వాల్ కి వరుసగా అవకాశాలు వచ్చాయి. చేతినిండా సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండేది. దాదాపు సిని ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలు అందరి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, నాగార్జున, ప్రభాస్, తరుణ్, బాలకృష్ణ, రవితేజ వంటి ఎందరో హీరోల సరసన ఆడి పాడింది. హీరోయిన్ గానే కాకుండా విలన్ గాను అదరగొట్టింది. హీరోయిన్ గా తన కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే అకస్మాత్తుగా మరణించింది. ఏవో కొన్ని కారణాలతో ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో ఆర్తి అగర్వాల్ ను వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.
ఈ విషయం పైన అప్పట్లో ఎన్నో రకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆర్తి అగర్వాల్ ఓ హీరోతో ప్రేమలో విఫలమైందని, ఆ కారణంగానే సూసైడ్ చేసుకుందని వార్తలు వచ్చాయి. అయితే ఆర్తి అగర్వాల్ ఇండస్ట్రీకి వచ్చిన సమయంలో ఓ దర్శకుడు తనకు సినిమా అవకాశాలు ఇస్తానని తెగ ఇబ్బంది పెట్టాడట. కానీ తాను చెప్పిన విధంగా చేయాలని అన్నాడట. దాదాపు 6 నెలల పాటు తన వెంటపడి నేను చెప్పినట్లు చేస్తే సినిమా అవకాశాలు ఇస్తానని టార్చర్ చేశాడట. ఈ వార్త ఆర్తి అగర్వాల్ సన్నిహితుల ద్వారా తెలుగులోకి వచ్చింది.