బాలయ్య జోరు మామూలుగా లేదే.. నెక్ట్స్ స్ట్రాంగ్ లైనప్ ఇదే.. !
నందమూరి నటసింహ బాలకృష్ణ తన కెరీర్ లోనే తిరుగులేని ఫాంతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే వరుసగా అఖండ - వీర సింహారెడ్డి - భగవంత్ కేసరి లాంటి మూడు సూపర్ డూపర్ హిట్ సినిమాలుతో ఫుల్ స్వింగ్ లో ఉన్న బాలయ్య సంక్రాంతికి డాకూ మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాతో ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చిన యువ దర్శకుడు కేఎస్ రవీంద్ర ( బాబి ) డాకు మహారాజ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముగిసింది. నిర్మాణాంతర పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. డాకు మహారాజ్ సినిమా రిలీజ్ కు కొద్ది రోజులు సమయమే ఉండడం తో పాటలు .. ప్రచార చిత్రాలతో హడావుడి కనిపిస్తోంది. మరోవైపు బాలయ్య డాకు మహారాజు సినిమా ప్రమోషన్లతో పాటు బోయపాటి శ్రీను దర్శకత్వం లో అఖండ 2 తాండవం షూటింగ్ చక చకా పరుగులు పెట్టిస్తున్నారు.
అఖండ సినిమాకు సీక్వెల్ గా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ఇది. తొలి షెడ్యూల్ ఇటీవల రామోజీ ఫిలిం సిటీ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ముగిసింది. ఇప్పుడు హైదరాబాద్ లోనే మరో కొత్త షెడ్యూల్ ప్రారంభించారు. ఈ షెడ్యూల్లో భాగంగా బాలయ్య తో పాటు మిగిలిన ప్రధాన తారాగణం పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాలు తో ముడి పడిన మాస్ యాక్షన్ కథతో ఈ సినిమా రూపొందుతుంది. బాలయ్య ఇందులో రెండు వైవిధ్యమైన పాత్రల లో కనువిందు చేయనున్నారు. వచ్చే యేడాది సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు శ్రీరాం ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా తమన్ స్వరాలు అందిస్తున్నారు.