వావ్: మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కృష్ణుడుగా మహేష్ బాబు..!

Divya
టాలీవుడ్ డైరెక్టర్లలో విభిన్నమైన దర్శకుడుగా పేరుపొందారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. కల్కి ,మహానటి తదితర చిత్రాలను తెరకెక్కించి భారీ క్రేజీ సంపాదించుకున్న ఈ డైరెక్టర్  కల్కి -2 సినిమా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ డైరెక్టర్ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు. కృష్ణుడి పాత్రకు టాలీవుడ్ లో ఏ హీరో ఎంపిక చేస్తారో అంటూ ఒక అభిమాని అడగగా.. అందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇలా మాట్లాడుతూ..

కల్కి చిత్రంలో కృష్ణుడికి పాత్రధారి ముఖాన్ని చూపించకూడదని నిర్ణయించుకున్నాను ఒకవేళ పూర్తిస్థాయి పాత్రలో చూపించగలిగితే అది కేవలం మహేష్ బాబు నటిస్తేనే చూపిస్తానని ఇది అభిమానులకు పండగే అనుకుంటారు అంటూ తెలిపారు. టీజర్ రిలీజ్ కి ముందే ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా  నిలుస్తుందనిపించిందిని..ఖలేజా సినిమాలో ఆయన పోషించిన క్యారెక్టర్ తనకు చాలా ఇష్టం అంటూ కూడా తెలిపారు. అలాగే కల్కి సినిమా రెండు భాగాలు తెరకెక్కించడంపై మాట్లాడుతూ...

కథను బట్టి మార్పులు చోటు చేసుకుంటాయని కొందరు రెండు పార్టీలను ఒకేసారి చిత్రీకరిస్తారని దానివల్ల బడ్జెట్ పైన కూడా ఎక్కువగా ప్రభావం పడుతుంది.. అందుకే రెండు పార్టీలు,రెండుసార్లు షూట్ చేస్తేనే ఎవరికైనా బడ్జెట్ పెరుగుతుంది అంటూ తెలిపారు. కల్కి సినిమాకి పెద్ద కథ సింగిల్ షాట్ అనే చిత్ర బృందం అందరూ కూడా పనిచేశామని కానీ మొత్తానికి అది రెండు పార్టీలు అయింది అంటూ తెలిపారు. ఈ డౌట్ ప్రభాస్ కి కూడా వచ్చిందని కానీ తను కొన్ని ఎడిటింగ్ లో కట్ చేస్తానని చెప్పానని చివరికి కల్కి రెండు పాత్రలు చేశామని వెల్లడించారు. అలాగే కల్కి సినిమాలోని ప్రభాస్ క్యారెక్టర్ పైన వచ్చిన విమర్శలకు ఇలా స్పందిస్తూ. ఆయన క్యారెక్టర్ ని అంచనా వేసుకుని భైరవ పాత్ర చూసి చాలామందికి నచ్చలేదేమో అంటూ తెలిపారు. కానీ భైరవ మాత్రం తమకు బాగా నచ్చారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: