డబ్బులు తీసుకుని ఆ పని చేసిన హీరో సూర్య..దుమ్మెత్తిపోస్తున్న జనాలు..!?
పెళ్లి వేదికపై సూర్య అడుగుపెట్టగానే అక్కడ ఉన్న అతిథులంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వైట్ అండ్ వైట్ అవుట్‌ఫిట్, సన్ గ్లాసెస్‌తో స్టన్నింగ్ లుక్‌లో కనిపించిన సూర్యను చూసి అందరూ మౌనమైపోయారు. అభిమానిని ప్రత్యేకంగా అభినందిస్తూ, పెళ్లి జంటకు శుభాకాంక్షలు తెలిపారు. సూర్యను ప్రత్యక్షంగా చూసిన ఆ వధువు ఆనందానికి అవధుల్లేవు. ఆమె ముఖంలో కనిపించిన ఆ భావోద్వేగ క్షణాలు అందరి హృదయాలను తాకాయి.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతూనే లక్షల సంఖ్యలో వ్యూస్ సంపాదిస్తోంది. ముఖ్యంగా వధువు సూర్యను చూసిన వెంటనే చూపించిన రియాక్షన్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన అభిమానులు“ఇలాంటి హీరోలు ఉండటం గర్వకారణం”,“సూర్య నిజంగా గోల్డ్ హార్ట్”,“అభిమానుల్ని దేవుడిలా చూసే హీరో” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక వీడియో కింద పెళ్లికొడుకు కూడా స్పందించాడు.“మా ఆహ్వానాన్ని మన్నించి, మా పెళ్లికి వచ్చి మాకు ఆశీర్వదించినందుకు థ్యాంక్యూ సర్” అంటూ ఆయన భావోద్వేగంగా కామెంట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు మరింతగా సూర్యపై అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇదే సమయంలో కొంతమంది మాత్రం నెగిటివ్ ప్రచారానికి దిగారు.“సూర్య ఇలా ఊరికే చేయడు”,“డబ్బులు తీసుకునే ఫ్యాన్ పెళ్లికి వెళ్లాడు”,“ఇది అంతా పబ్లిసిటీ కోసమే” అంటూ కొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సరైన ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. వాస్తవానికి సూర్య గతంలో కూడా ఎన్నోసార్లు తన అభిమానుల పట్ల తన గొప్ప మనసును చాటుకున్నారు. సేవా కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాలు, అభిమానుల ప్రత్యేక సందర్భాల్లో పాల్గొనడం వంటి ఎన్నో ఉదాహరణలు ఆయన జీవితంలో ఉన్నాయి. అలాంటి వ్యక్తిపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం అనవసరమని పలువురు నెటిజన్లు ఖండిస్తున్నారు.
మొత్తానికి, ఈ వీడియో ఒకవైపు సూర్య అభిమానులను ఆనందంతో ముంచెత్తుతుంటే, మరోవైపు ట్రోలర్స్‌కు కొత్త టాపిక్‌గా మారింది. అయినా సరే, సూర్య చేసిన ఈ చిన్న కానీ హృదయాన్ని తాకే పని ఆయన అభిమానుల మనసుల్లో ఆయనకు ఉన్న స్థానం ఎంత ప్రత్యేకమో మరోసారి రుజువు చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.