చిరంజీవి - అల్లు అరవింద్ కాంబో మళ్లీ రాగలద.. పాత కాంబినేషన్ సెట్ అయ్యానా..?
ఖైదీ నెంబర్ 150 , సైరా నరసింహారెడ్డి , ఆచార్య, బోళా శంకర్ సినిమాలు ఇతర బ్యానర్లతో కొంత దూరంగా ఉంటాడని చూపించాయి . ఇక గీత ఆర్ట్స్ లో చిరు సినిమా ఉండకపోవటం వెనుక ప్రత్యేక కారణం లేకపోయినా అందరికీ కనిపించని విషయం మాత్రం ఊహించని అంచనాలు కావచ్చు. ఇక గీత ఆర్ట్స్ గత కొంతకాలంగా పెద్ద సినిమాలను కాకుండా మీడియం సినిమాలను ఎక్కువగా నిర్మిస్తుంది. అల్లు అరవింద్ పర్యవేక్షణలో బన్నీ వాసు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో సినిమాలను హ్యాండిల్ చేస్తూ కొత్త దర్శకులు హీరోలతో ప్రయోగాత్మక సినిమాలను తీసుకువస్తున్నారు .. బన్నీ వాసు అల్లు అరవింద్ కాంబోలో వచ్చిన ప్రాజెక్టులు మాత్రం గీత ఆర్ట్స్ కి భారీ విజయాలు తీసుకొచ్చాయి.
ఇక చిరంజీవి , అల్లు అరవింద్ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నా అభిమానులు మాత్రం ఎందుకు ఈ కాంబో రీ ఎంట్రీ తర్వాత సెట్ కాలేదని ప్రశ్నలు వేస్తున్నారు. ఇక చిరంజీవి సినిమా అంటే అడిషనల్ ఫ్రెషర్ కావచ్చు.. లేదా సరైన కథ కోసం ఎదురుచూడటం కావచ్చు కానీ ఫ్యామిలీకి గ్యాప్ లేదని, అన్ని సరైన సమయంలోనే జరగాలని ఇరు కుటుంబాలు స్పష్టంగా చెబుతున్నాయి.. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గీత ఆర్ట్స్ నుంచి చిరు సినిమా వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తున్న సరైన కథతో అందరి అంచనాలను దాటేలా ఈ కాంబో మళ్లీ తెరపైకి రావాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.