షాక్: రెండో భార్యతో కూడా స్టార్ డైరెక్టర్ విడాకులా..?
ఆ తర్వాత ప్రముఖ డైరెక్టర్, నిర్మాత అయిన గీతాంజలిని రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ తాజాగా గీతాంజలి చేసిన ఒక పని వల్ల అభిమానులకు మరింత సందేహం కలిగించేలా చేసింది. తాజాగా గీతాంజలి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఉండేటువంటి సెల్వరాఘవన్ కి సంబంధించిన ఫోటోలను సైతం తొలగించినట్లుగా వినిపిస్తోంది.డైరెక్టర్ సెల్వరాఘవన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గానే కనిపిస్తారు. తరచూ జీవిత సత్యాలను తెలియజేస్తూ, సెల్వరాఘవన్ తన భార్య పిల్లలతో కలిసి ఉంటే ఫోటోలను ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటారు.
కానీ గీతాంజలి చేసిన పని వల్ల ఒక్కసారిగా కోలీవుడ్ పరిశ్రమలో వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో చాలామంది సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా పోస్టులను తొలగించడం వల్ల తాము పరోక్షంగా విడిపోతున్నట్లుగా హింట్ ప్రకటిస్తున్నారు. ఇప్పుడు సెల్వరాఘవన్ రెండవ భార్య గీతాంజలి కూడా అదేవిధంగా చేస్తున్నారా? అనే అనుమానాలు అభిమానులలో కలవరపెడుతున్నాయి. సోనీ అగర్వాల్ తో విడాకుల అనంతరం సెల్వ రాఘవన్ 2011లో గీతాంజలిని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. సెల్వ రాఘవన్ ఈమధ్య ఎక్కువగా విలన్ పాత్రలలో నటిస్తూ బాగానే పేరు సంపాదించారు. డైరెక్టర్ గా పెద్దగా సినిమాలను చేయడం లేదు. గతంలో కూడా సెల్వరాఘవన్ పైన ఇలాంటి వార్తలే రావడంతో తన భార్యతో కలిసి ఉన్న ఫోటోలను సైతం షేర్ చేసి రూమర్స్ కి చెక్ పెట్టారు. మరి ఈసారి అలాంటి వార్తలకు చెక్ పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.