గేమ్ ఛేంజర్: మెగాస్టార్ రివ్యూ..ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోండమ్మా..!
అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ తాను విజయవాడకు వచ్చే ముందే చిరంజీవి గారికి ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు సినిమా చూశారు కదా.. ఇప్పుడు సినిమా పూర్తిగా అయిపోయింది.. ఇప్పుడు మరొకసారి సినిమా చూడండి అని అడిగానని.. వాళ్లు అక్కడ సినిమా చూడడం మొదలు పెట్టారని అలాంటి సమయంలో తాను ఇక్కడికి బయలుదేరి వచ్చానని ఇక్కడకు వచ్చిన వెంటనే చిరంజీవి గారి తనకు ఫోన్ చేశారని తెలిపారు దిల్ రాజు.. ఈసారి సంక్రాంతికి మామూలుగా కొట్టడం లేదు అంటూ ఫ్యాన్స్ కి చెప్పండి అంటూ చిరంజీవి గారే చెప్పారని దిల్ రాజు తెలిపారు.
నాలుగు సంవత్సరాల క్రితం డైరెక్టర్ శంకర్ గారు కథ చెప్పినప్పుడు ఎలా ఫీలయ్యానో చిరంజీవి గారు కూడా ఒక్కో సీన్ గురించి చెబుతూ ఉంటే అలాగే ఫీలయ్యానంటూ తెలిపారు. జనవరి 10వ తేదీన రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని చూడబోతున్నారంటూ తెలిపారు. ఐఏఎస్ ఆఫీసర్గా, పోలీస్ ఆఫీసర్ గా మరో కొద్దిసేపు రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నారట రామ్ చరణ్. ఈ సినిమాతో శంకర్ మరొకసారి తన మార్కు ఖచ్చితంగా చూపిస్తారని తెలిపారు. ప్రతి ఒక్క అభిమాని కూడా కాలర్ ఎగలేసేలా ఉంటుంది అంటే తెలిపారు. రామ్ చరణ్ సీన్లతో థియేటర్ దద్దరిల్లిపోతాయి అంటూ తెలిపారు. జనవరి 1న ట్రైలర్ రిలీజ్ చేస్తామని.. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ లను బట్టి గ్రాండ్గా ఆయన చేతుల మీదగా రిలీజ్ చేయబోతున్నామని తెలిపారు.