టాలీవుడ్‌లో హీరోగా వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకులని అలరించిన హీరో శివాజి.ఆయన చిత్రాలు ప్రేక్షకులకి మంచి వినోదం పంచాయి. అయితే తర్వాత శివాజి మెల్లగా సినిమాలకి బ్రేక్ ఇచ్చి వేరే రూట్ తీసుకున్నారు. అడపాదడపా పలు పార్టీలకి సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలిచేవారు. అయితే ఊహించని విధంగా బిగ్ బాస్ సీజన్7లో పాల్గొన్న శివాజి మళ్లీ పాత వైభవం అందుకున్నాడు. బిగ్ బాస్ లో పాల్గొనడంతో శివాజి క్రేజ్ ఓ రేంజ్‌లో పెరిగింది.ఆయన ఇటీవల ఓ వెబ్ సిరీస్‌తో కూడా అలరించాడు. పలు సినిమాలలో హీరోగా కూడా చేస్తున్నట్టు టాక్ వినిపించింది. అయితే తాజాగా శివాజి మెగాస్టార్ చిరంజీవి గురించి చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శివాజీ, చిరంజీవి తనకు చేసిన సాయం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.శివాజీ చిరంజీవితో కలసి ఇంద్ర చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇంద్ర చిత్రంలో శివాజీ కథని మలుపు తిప్పే పాత్రలో నటించారు. ఇంటర్వెల్ సన్నివేశంలో శివాజీ పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుంది. తనకి చిరంజీవితో మంచి అనుబంధం ఉంది అని శివాజీ తెలిపారు.ఇంద్ర మూవీ చేసేటప్పుడు నేను ఆయనకు అభిమానిగా, ఆర్టిస్ట్‌గా మాత్రమే తెలుసు. అప్పుడు మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది.
అయితే అప్పుడు నేను డబ్బుల్లేక రూమ్ రెంట్ కట్టడానికి డబ్బులు కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. అయితే ఈ విషయం ఎవరో చిరంజీవి గారితో చెప్పారట. వెంటనే ఆయన షూటింగ్ అయ్యాక నా దగ్గరకు వచ్చి పదివేల రూపాయలు ఇచ్చారు. నేను వద్దు అంటున్నా కూడా నా చేతిలో పెట్టారు. అలా ఆ డబ్బులతో సంవత్సరం వరకు నాకు రూమ్ రెంట్ సమస్య రాలేదు అని శివాజీ అన్నారు.అప్పటికి నేను ఆయనకు అంతగా తెలియకపోయిన నాకు సాయం చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అందుకే చిరంజీవి గారిని స్పూర్తిగా తీసుకొని అప్పటి నుండి జీవితంలో ఎవరికైన తోచినంత సాయం చేయాలని డిసైడ్ అయి సేవా కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టాను అని శివాజి తెలిపారు. కాగా, మెగాస్టార్ చిరంజీవిని నటుడిగా కన్నా కూడా సేవా దృక్పథం ఉన్న వ్యక్తిగా జనాలు చాలా ఇష్టపడుతుంటారు. ఆయన మనకు తెలియకుండా సినీ పరిశ్రమ వ్యక్తులకు, అభిమానులకు ఎంతోమందికి సహాయం చేసారు. అప్పుడప్పుడు పలువురు ఇంటర్వ్యూలలో వారు తెలియజేయడం వలన ఇలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి.