రామ్ చరణ్ కు పాన్ ఇండియా మార్కెట్లో ఊహించని ఛాలెంజ్.. ఎలా అధిగమిస్తాడు..?
ఇక దీంతో గేమ్ ఛేంజర్ ద్వారా పాన్ ఇండియా మార్కెట్ పై చరణ్ పట్టు చూపించాలని.. ఈ సినిమా విజయంపై హిందీ మార్కెట్లో రామ్ చరణ్ స్టామినా ఏమాత్రం ఉందో తెలియనుంది. ఇప్పటివరకు గేమ్ ఛెంజర్ బడ్జెట్ భారీగా పెరిగినట్లు సమాచారం నిర్మాణ ఖర్చులు రీమ్యునరేషన్‌లు కలిపి 400 కోట్లు వరకు దాటినట్టు తెలుస్తుంది. నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలో ఇప్పటికే 200 కోట్లు రాబట్టిన నిర్మాతలు థియేటర్ రన్ ద్వారా మిగిలిన మొత్తాన్ని రికవరీ చేయాలని చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సీజన్ అదనపు ప్రయోజనంగా ఉన్నప్పటికీ హిందీ మార్కెట్లో సినిమాకు ఎలాంటి టాక్ రాబోతుందనేది కీలకంగా మారుతుంది.
బాహుబలి , పుష్ప2, దేవర వంటి సినిమాలు నార్త్ మార్కెట్లో సాధించిన విజయాలు పాన్ ఇండియా సినిమాలకు మార్గదర్శకంగా నిలిచాయి. అల్లు అర్జున్ , ఎన్టీఆర్ వంటి హీరోలు రాజమౌళి సపోర్ట్ లేకుండానే తమ మార్కెట్‌ను మరింత పెంచుకున్నారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే స్థాయిలో తన సత్తా చాటాలని చూస్తున్నారు. త్రిబుల్ ఆర్ విజయానికి రాజమౌళి దర్శక ప్రతిబ ప్రధాన ఆకర్షణంగా నిలిచింది.. అయితే ఇప్పుడు రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేక స్థానం సాధించగలడా అనే సందేహాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి రామ్ చరణ్ తానేంటో నిరూపించుకొని ఈ అగ్ని పరీక్షలో గేమ్ ఛేంజర్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి..