జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడో తెలుసా.. !
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది. ఎప్పుడో రెండున్నర సంవత్సరాల క్రితం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి త్రిబుల్ ఆర్ అనే మల్టీ స్టార్లర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. త్రిబుల్ ఆర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా రు. 1200 కోట్ల వసూళ్లు రాబట్టింది. అయితే అది రాజమౌళి సినిమా అందులోనూ రాంచరణ్ మరో హీరోగా ఉన్నారు. రెండున్నర సంవత్సరాల తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ ఈ ఏడాది దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆచార్య లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయింది.
ఎన్టీఆర్ కు జోడిగా బాలీవుడ్ ముద్దు గుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఈ సినిమాకు ముందు మిక్స్ డ్ టాక్ వచ్చిన కూడా కేవలం ఎన్టీఆర్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ .. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 సినిమాలలో నటించనున్నారు. ఎన్టీఆర్ ఇప్పటికే నూతన సంవత్సర వేడుకల కోసం బ్రిటన్ లో వాలిపోయాడు. కుటుంబ సభ్యుల తో పాటు బ్రిటన్ వెళ్లిన ఎన్టీఆర్ న్యూ ఇయర్ వేడుకలను అక్కడ సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. ఇప్పటికే లండన్ వీధుల్లో ఎన్టీఆర్ ఎంజాయ్ చేస్తున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. ఈ వీడియో లలో ఎన్టీఆర్ చాలా స్టైలీష్ లుక్ లో దర్శన మిస్తున్నాడు.