సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఫ్యామిలీకి .. ఈ సారి న్యూ ఇయ‌ర్ వేడుక‌లు ఎక్క‌డో తెలుసా.. !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ యేడాది మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతి కానుకగా భారీ అంచనా ల మధ్య రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా ప్రపంచ వ్యాప్తంగా 180 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టిన మహేష్ బాబు స్థాయికి తగిన హిట్ సినిమాగా నిలవలేదు. గుంటూరు కారం సినిమాపై భారీ అంచనాలు ఏర్పడటానికి ప్రధాన కారణం అంతకుముందు మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అతడు - ఖ‌లేజా ఈ రెండు సినిమాలో మంచి కథాబలం ఉన్న సినిమాలుగా పేరు తెచ్చుకోవటమే. గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు తన కెరీర్ 29 వ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశ లో ఉన్న ఈ సినిమా షూటింగ్ వచ్చే యేడాది ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు ఏ మాత్రం గ్యాప్ దొరికిన తన ఫ్యామి లీ తో కలిసి విదేశాలకు చెక్కేస్తాడు. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ వేడుకలకు చాలా గట్టిగా ప్లాన్ చేశాడు. ఆల్రెడీ తన భార్య న‌మ్ర‌త‌ తో పాటు పిల్లలం తా ఇప్పటికే స్విట్జర్లాండ్ వెళ్లిపోయారు .. త్వరలోనే మహేష్ కూడా అక్కడికి వెళ్లి వారితో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పాల్గొంటాడు. కొద్ది రోజుల పాటు అక్కడే ఉండి ఆ తర్వాత తిరిగి వచ్చి రాజమౌళి సినిమా కోసం వర్క్ షాప్ లో జాయిన్ అవుతాడు. ఆ త‌ర్వాత కాస్త గ్యాప్ తీసుకుని ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: