రెండు ఫోన్లలో ఒకే వాట్సప్ నంబర్.. ఇలా చేస్తే మాత్రం ఇబ్బందులు లేనట్టే!
వ్యాపారాలు చేసేవాళ్లకు ప్రధానంగా ఈ ఆప్షన్ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు. రెండో డివైజ్ లో ఉన్న వాట్సప్ సహాయంతో పనులను సులభతరంగా చేసే వీలు అయితే ఉంటుందని చెప్పవచ్చు. వెబ్ వాట్సప్ యాప్ సహాయంతో కూడా రెండు ఫోన్లలో వాట్సప్ వాడే వీలు ఉంటుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి web.whatsapp.com అనే వెబ్ సైట్ ద్వారా సులువుగా వాట్సప్ లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది.
రెండో ఫోన్లలో వాట్సప్ ను వాడాలని భావించే వాళ్లు కంపేనియన్ డివైజ్ ఆప్షన్ ను ఎంచుకుని ప్రైమరీ ఫోన్ లో స్కాన్ చేసి లాగిన్ అవ్వడం ద్వారా రెండు ఫోన్లలో యాప్ ను వినియోగించే వీలు ఉంటుంది. గతంలో వాట్సప్ వెబ్ వినియోగించాలంటే ప్రైమరీ డివైజ్ కనెక్ట్ చేసి ఉండాలి. ప్రస్తుతం ప్రైమరీ డివైజ్ తో సంబంధం లేకుండా చాట్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.
లింక్డ్ డివైజ్ ఆప్షన్ సహాయంతో వాట్సప్ యాప్ ను గరిష్టంగా నాలుగు డివైజ్ లను కనెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రైమరీ ఫోన్ లో ఆప్షన్ ను తొలగించుకోవడం ద్వారా మరో వాట్సప్ ను తొలగించుకునే అవకాశం అయితే ఉంటుంది. వాట్సప్ యాప్ ను ఎక్కువగా వాడే వాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. వాట్సప్ ను సరైన విధంగా ఉపయోగిస్తే మాత్రమే ఎక్కువ బెనిఫిట్స్ పొందవచ్చు.