బాయిలోనే బల్లిపలికే ఫోక్ సాంగ్ కి..యూట్యూబ్ ద్వారా ఎన్ని లక్షలు వచ్చాయంటే..?

Divya
ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎక్కడ చూసినా ఫోక్ సాంగ్స్ ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి. వీటిని సినిమాలలో కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటివి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ మధ్య మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో భారీ పాపులారిటీ సంపాదించిన ఫోక్ సాంగ్ బాయిలోనే బల్లి పలికే పాటతో ఓవర్ నైట్ కి స్టార్ గా ఎదిగిపోయింది నాగవ్వ. ఈ పాటకి సింగర్ మంగ్లీ డాన్స్ కూడా హైలెట్గా నిలిచింది. ఇటీవల నాగవ్వ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో ఎదురైన కష్టాలను పంచుకుంది.


నాగవ్వ మాట్లాడుతూ జగిత్యాల జిల్లా ఎనాపల్లి మండలంలో గుల్లకోట గ్రామంలో  వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని తెలియజేసింది. పొలం పనులు చేస్తూ అలసట తీర్చుకొనే సమయంలోనే తన చుట్టూ ఉన్న వాళ్లను మరింత ఉత్సాహపరచడానికి తాను ఫోక్ సాంగ్స్ పాడటం అలవాటుగా చేసుకున్నానని తెలిపింది. బాయిలోని బల్లి పలికే అనే పాట.. తన అమ్మమ్మ ద్వారా వచ్చిన ఒక సాంప్రదాయమైన పాట అంటూ తెలిపింది నాగవ్వ. నాగవ్వ తండ్రి బల్లి పలకడం కూడా ఒక శుభ సూచికమని చెప్పే వారిని ఈ నమ్మకంతోనే పాట పుట్టుకకు కారణమైందంటూ తెలియజేసింది.


దూరపు కాలంలో ఎక్కువగా దొంగల భయం వల్ల ప్రజలు తమ బంగారాన్ని వెండిని ఎక్కువగా బావులలోనే దాచేవారు. అయితే బల్లి పలికిన చోట తవ్వకాలు చేయడం వల్ల అలాంటి సంపదలు బయటపడతాయనే నేపథ్యం అని తెలియజేసింది. నాగవ్వ కుమారుడు దర్శకుడుగా మారాలనుకుంటున్నాడని అతడు కూడా ఈ పాటకి చాలా కష్టపడ్డారని తెలిపింది. ఈ పాట కోసం ఏకంగా మూడేళ్ల పాటు వేచి చూశాము. సింగర్ మంగ్లీ టీమ్ కూడా ఈ పాట కోసం చాలా కష్టపడ్డారు. సుమారుగా రూ .15 లక్షల రూపాయల వరకు ఈ పాట కోసం ఖర్చు చేశామని తెలిపింది. అయితే కేవలం మూడు రోజులలోనే షూటింగ్ పూర్తి చేశాను తాము అనుకున్న దానికంటే ఎక్కువగానే పాపులర్ కి లభించింది. విడుదలైన నెల రోజులకే 70 మిలియన్స్ పైగా వ్యూస్ లభించాయి. రోజుకి 1 మిలియన్ వస్తోంది అంటూ తెలియజేశారు నాగవ్వ. ఇప్పటికే తాము పెట్టిన డబ్బులు బయటకి వచ్చేసాయని తెలిపింది నాగవ్వ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: