జగన్.. తిరుమల అంటే ఆటలుగా ఉందా?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. తిరుమలలో టీడీడీ ఏర్పాటు చేసిన పెద్ద తెరలపై సినిమా పాటలు ప్రసారమైన వివాదంపై ఆయన స్పందించారు. దేవుడంటే ఆట‌లాట‌లా వుందా అని నారా లోకేశ్ ప్రశ్నించారు. ఏడుకొండ‌ల‌వాడి స‌న్నిధిలో సినిమా పాట‌లా అని నారా లోకేశ్ నిలదీశారు. భ‌క్తుల‌కి న‌ర‌కం చూపుతున్నారని.. ప‌విత్రత  మంట‌గ‌లుపుతున్నారని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవింద‌నామ‌స్మర‌ణ మారుమోగే తిరుగిరుల‌పై సినిమా పాట‌ల ప్రద‌ర్శన దారుణం అన్న నారా లోకేశ్ .. ఈ అప‌చారాన్ని క‌వ‌ర్ చేసేందుకు రేపు ఏ సినిమాటిక్ క‌థ వినిపిస్తారో అని ఎద్దేవా చేశారు. తిరుమలలో పెద్ద తెరలపై సినిమా పాటలు ప్రసారం కావడం వివాదంగా మారింది. నిన్న సాయంత్రం 5.45 నుంచి 6.15 వరకు సినిమా పాటలు ప్రసారమయ్యాయి. గోవింద నామాలు ప్రసారమయ్యే తెరలపై సినిమా పాటలు ప్రసారమవడంపై టీటీడీ వివరణ ఇచ్చింది. సెట్ అప్ బాక్స్ లో సాంకేతిక లోపంతో సినిమా పాటలు ప్రసారం అయ్యాయని తెలిపింది. అయితే వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించామని టీటీడీ వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: