టాలీవుడ్ తెరపై ఎవరు ఊహించని బయోపిక్ .. శర్వానంద్ - నాని హీరోలుగా ఫిక్స్..!

Amruth kumar
తెలుగులో బయోపిక్ లకు ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే .. మహానటి తో దర్శకుడు నాగ్‌ అశ్విన్ సినీ ప్రేక్షకులకు అలాంటి కథల‌పై కోత్త‌ కోణాన్ని అందించారు .. ఈ సినిమా సక్సెస్ తో బయోపిక్ లపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆ తర్వాత ఇతర బయోపిక్ లు తెరపైకి వచ్చే ప్రయత్నాలు జరిగిన అవి పూర్తిస్థాయిలో ప్రేక్షకుల‌ ముందుకు రాలేకపోయాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఎవరు ఊహించని సరికొత్త బయోపిక్ పై చర్చ నడుస్తుంది. ఆ బయోపిక్ ఎవరిది అంటే తెలుగు సినిమా గర్వించదగ్గ లెజెండ్ దర్శకులు బాపు-రమణల జీవిత కథ ..

బాపు - రమణ జోడి తెలుగు సినిమా కథ శైలకే కొత్త ఒరవడి తీసుకువచ్చినవారు .. వారి కథను సినిమాగా తెరకెక్కిస్తే అది సినీ ప్రియులకు ఒక గొప్ప అనుభవంగా మారుతుందని చూస్తున్నారు. రచయిత సాయి మాధవ్ బుర్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాబు - రమణల‌ జీవితం వెండితెరపై తీసుకురావాలని తాను చూస్తున్నట్లు చెప్పాడు. వారి పాత్రల కోసం నేచురల్ స్టార్ నాని - శర్వానంద్ .. హీరోలగా కరెక్ట్ గా సెట్ అవుతారని ఆయన అభిప్రాయపడ్డారు.. నాని, బాపు మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని పరిశీలిస్తే ఈ కాంబినేషన్ మరింత ఆస్తికరంగా మారుతుంది ..

నాని , బాపు దర్శకత్వంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది.. అందుకే నాని ఈ పాత్రకు న్యాయం చేయగలరని భావిస్తున్నాను.. ఇక శర్వానంద్‌ తన విభిన్నమైన పాత్రల ఎంపికలోనే ఎమోషనల్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే సామర్థ్యాన్ని చూపించాడు. రమణ గారి పాత్రకు తగిన యంగ్ నటుడుగా శర్వానంద్ స‌రైన‌ ఎంపికాని సాయి మాధవ్ భావిస్తున్నారు. ఈ బయోపిక్ కు స్క్రిప్ట్ మలచడానికి సాయి మాధవ్ బుర్రా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు .. పాత తరం సినిమాలపై గొప్ప అవగాహన కలిగిన ఈయన ఈ ప్రాజెక్టును స్వయంగా డైరెక్ట్ చేసే అవకాశం కూడా ఉందనే టాక్ వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: