మేనల్లుడి కోసం.. హీరోని తప్పించిన నాగార్జున.. కట్ చేస్తే..?

RAMAKRISHNA S.S.
తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి, వెంకటేష్ ,నాగార్జున, బాలయ్య వంటి అగ్ర హీరోలు సినీ ఇండస్ట్రీకి నాలుగు స్తంభాల లాంటి వారిని చెప్పవచ్చు. వీరి వల్ల ఎంతోమంది దర్శకనిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.అందుకే చాలామంది వీరికి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. వీరి మాటలకు దర్శకనిర్మాతలు ఎప్పుడూ కూడా తీసివేయరు. ఒకప్పుడు వీరు ఏం చెప్పినా కూడా అది జరగాలని అనుకునేవారు. అలా చాలామంది హీరోలు తమ సినిమాలనుంచి ఎవరో ఒకరిని తప్పించిన సందర్భాలు కూడా చాలానే ఉంటాయి..

కానీ నాగార్జున మాత్రం తన స్వార్థం కోసం ఒక నటుడిని ఒక సినిమా నుంచి తప్పించారనే వార్తలు కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. అలా తప్పించిన సినిమా  'స్నేహమంటే ఇదేరా' ఈ సినిమా తమిళ చిత్రానికి రిమేక్ గా తీశారట. సూపర్ గుడ్ ఫిలిం ఆర్.బి.చౌదరి నిర్మాతగా ఈ సంస్థలలో నాగార్జున ఎక్కువగా సినిమాలు నటించేవారట.. ముఖ్యంగా నిన్నే ప్రేమిస్తా, నువ్వు వస్తావని సినిమాలు రిలీజ్ చేసి మంచి విజయాలను అందుకున్నాయి. అలా ఈ బ్యానర్ పైన తమిళ డైరెక్టర్ బాల శేఖర డైరెక్షన్లో స్నేహమంటే ఇదేరా సినిమాని తీయాలనుకున్నారట.

మొదట నాగార్జున, హీరో వేణులను అనుకున్నారట. వేణుకి అడ్వాన్స్ కూడా ఇచ్చినప్పటికీ రేపటి రోజున సినిమా ఓపెనింగ్ కి రావాల్సి ఉండగా హీరో వేణునీ పిలిచి.. నాగార్జున మిమ్మల్ని ఈ సినిమా నుంచి  తీసేయమని చెప్పారని ఆస్థానంలో తన మేనల్లుడు సుమంత్ నటిస్తారని.. మీరు ఏమి అనుకోవద్దు ఇంకొక సినిమా కచ్చితంగా మనం చేద్దామని చెప్పడంతో హీరో వేణు ఈ సినిమా నుంచి బాధపడుతూ తప్పుకున్నారట..అలా స్నేహమంటే ఇదేరా సినిమా నుంచి నాగార్జున వేణుని తప్పించారని వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.. నాగార్జున మీద వినిపిస్తున్న ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. వైరల్ గా మారుతున్నది.ఇందులో భూమిక ప్రత్యూష హీరోయిన్స్ గా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: