బాలీవుడ్ కి వెళ్ళిపోతారా.. శ్రీలీల సమాధానం ఏంటో తెలుసా?

frame బాలీవుడ్ కి వెళ్ళిపోతారా.. శ్రీలీల సమాధానం ఏంటో తెలుసా?

praveen
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న, పెద్ద హీరో అనే తేడా లేకుండా టాలీవుడ్ని గత కొన్ని సంవత్సరాలుగా ఏలుతున్న ఈ యువ భామ గత కొన్ని రోజులుగా బాలీవుడ్లో ఎక్కువగా దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి షిఫ్ట్ కాబోతుందన్న రూమర్లు సోషల్ మీడియాలో బాగా వినబడుతున్నాయి. దాంతో ఆమె తాజాగా నటించిన 'రాబిన్ హుడ్' మూవీ ప్రమోషన్లలో ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

టాలీవుడ్ నటుడు నితిన్ నటించిన కామెడీ ఎంటర్టైనర్ 'రాబిన్ హుడ్' గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా చేసింది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న 2వ సినిమా కావడంతో ఈ సినిమాపైన జనాలకు ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. ఇంతకు మునుపు వీరి కాంబోలో 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' అనే సినిమా వచ్చి సూపర్ డూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెరపైకి రాబోతున్న 'రాబిన్ హుడ్' మూవీకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా... బడా నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. రిలీజుకి సిద్ధపడిన ఈ సినిమా ప్రసార కార్యక్రమాలు కూడా భారీ స్థాయిలో నిర్వహించింది. దానికి కారణం ఇందులో కీలక పాత్రలో ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ అంశం సినిమాకి అదనపు హైప్ క్రియేట్ చేసింది. విషయంలోకి వెళితే... మార్చ్ 28న మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో హీరోయిన్ శ్రీలీల తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొనగా... ఒక జర్నలిస్ట్ ఆమెని ఉద్దేశించి... బాలీవుడ్ కి మీరు షిఫ్ట్ అవుతున్నారేమో అని అనుమానం వస్తోంది! అని అడగగా... శ్రీలీల స్పందిస్తూ... "తెలుగు ఇండస్ట్రీ నా ఇల్లు. బాలీవుడ్ కి వెళ్ళిపోవడం అనేది ఎప్పటికీ జరగదు!" అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే వాస్తవానికి, చాలామంది హీరోయిన్లు టాలీవుడ్లో కొంత ఫేమ్ రాగానే బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోతున్నారు. ఇది మొదటినుండీ జరుగుతోంది. ఆ లిస్టులో ఇప్పటిదాకా అసిన్, తాప్సీ తదితరులు ఉన్నారు. ఇప్పుడు రష్మిక మందన్న ఇటు సౌత్, అటు నార్త్ లో కూడా దుమ్మురేపుతోంది. శ్రీలీల పరిస్థితి ఏమిటో రాబోయే రోజుల్లో తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: