
ఆ సినిమాకు కూడా సీక్వెల్ కావాలంటున్న యంగ్ టైగర్ ఫ్యాన్స్.. సాధ్యమవుతుందా?
జనతా గ్యారేజ్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తే ఆ సీక్వెల్ లో నటించడానికి సిద్ధమంటూ మోహన్ లాల్ కామెంట్లు చేయడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం జనతా గ్యారేజ్ కు సీక్వెల్ కావాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సీక్వెల్ గురించి తారక్ మనస్సులో, కొరటాల శివ మనస్సులో ఏముందో తెలియాల్సి ఉంది. జనతా గ్యారేజ్ సీక్వెల్ తెరకెక్కించినా పాన్ ఇండియా స్థాయిలో హిట్ చేయడం సులువు కాదు.
ఒక విధంగా జనతా గ్యారేజ్ కూడా తారక్ కెరీర్ లో మల్టీస్టారర్ అని చెప్పవచ్చు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. జనతా గ్యారేజ్ అప్పట్లో 80 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. ఎన్టీఆర్ త్వరలో సీక్వెల్స్ గురించి క్లారిటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తారక్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. తారక్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్ ను ఎంచుకుని మరిన్ని రికార్డ్ క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.