ఎండ వేడిమికి ముఖం ఎర్రగా అవుతోందా..??

NCR

ఎండాకాలం లో ఎలాంటి వారికైనా సహజంగా కలిగే మార్పులు తమ శరీర రంగు మార్పు చెందటం, ముఖం పై మొటిమలతో కూడినట్టుగా చెమట కాయలు రావడం, తద్వారా చర్మం అందవిహీనంగా తయారవ్వడం. అలా చర్మం సహజత్వాన్ని పోయి మళ్ళీ పూర్వ రూపు రావడానికి చాలా సమయం పడుతుంది. అది కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే. కానీ అసలు అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకుంటే ఎప్పటిలానే మీ అందమైన చర్మాన్ని, రంగుని కాపాడుకోగలుగుతారు. మరి ఎండాకాలంలో చర్మాన్ని కాపాడుకోవడం, ముఖం ఎర్రగా మారకుండా చేయడం ఎలాగో ఎప్పుడు చూద్దాం..

 

ఎటువంటి కాలంలో అయినా సరే చర్మాన్ని కాపాడుకోగల సహజసిద్దమైన ఏకైక ఔషదం కలబంద. కలబంద గుజ్జు తో ఎండవేడిమి వల్ల కలిగే నెప్పిని, ఎర్రటి చర్మాన్ని, చెమట కాయలు రాకుండా కూడా కాపాడుకోవచ్చు. సహజ సిద్దమైన చర్మానికి సన్ స్ట్రోక్ తగలకుండా కాపాడటంలో కలబందకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది యాంటీ సెప్టిక్ మరియు అనాల్జెసిక్ గుణాలను కలిగి ఉండటంతో చర్మ సమస్యని దూరం చేస్తుంది, నెప్పులని దూరం చేస్తుంది. అంతేకాదు చర్మానికి తేమని అందించి, మంచి స్కిన్ టోన్ గా కూడా పని చేస్తుంది. మరి కలబంద గుజ్జుతో చర్మాని సన్ స్ట్రోక్ నుంచీ  ఎలా కాపడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

 

  • ముందుగ కలబంద గుజ్జుని తగినంత తీసుకోవాలి. ఆ తరువాత వేళ్ళతో ఎక్కడైతే చర్మం కమిలి ఎర్రగా అయ్యిందో, లేక ఎండ వేడిమికి ప్రభావితం అయ్యిందో ఆ ప్రాంతాలలో గుజ్జుని రాయండి.
  • గుజ్జు రాసిన ప్రాంతంలో మెల్లగా మర్దనా చేస్తూ ఉండండి. ఇలా కొన్ని నిమిషాల పాటు మర్దనా చేస్తూ ఉండాలి.
  • ఇలా చేసిన తరువాత కాసేపు గాలికి ఆరనివ్వాలి. ఈ సమయంలో ఆ కలబంద గుజ్జు చర్మంలోనికి చొచ్చుకుని వెళ్తుంది.
  • కాసేపటి తరువాత చల్లటి నీటిని ఉపయోగించి శుభ్రంగా కడిగేయండి. ఇలా వారానికి మూడు సార్లు చేయడం వలన సన్ స్ట్రోక్ నుంచీ చర్మాన్ని సులభంగా కాపాడుకోవచ్చు.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: