ఆడవాళ్లు ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనా లో మీకు తెలుసా..!?

Suma Kallamadi
ఆడవాళ్ళు అందంగా కనిపించడానికి రకరకాల పేస్ మాస్క్స్ వేసుకుంటూ ఉంటారు . అయితే ఫేస్ పాక్స్ ఆడవాళ్ళ ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. నిజమే, కానీ అవి ఎలా మేలు చేస్తాయో అన్న విషయం చాలా మందికి తెలియదు. అసలు ఈ ఫేస్ ప్యాక్స్ వల్ల ఆడవాళ్ళకి ఎలాంటి ఉపయోగంలో తెలుసుకుందాం.. ! ఆడవాళ్ళ చర్మం ప్రతిరోజు నిగారించాలంటే  రెగ్యులర్ గా ఫేస్ పాక్స్  వేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.  అయితే, ఫేస్ ప్యాక్స్ సాధారణంగా ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకోవచ్చు. అయితే, ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఒకరికి ఫలితం చూపించిన ఫేస్ పాక్ ఇంకొకరికి ఫలితం చూపించకపోవచ్చు. అందుకనే ఫేస్ పాక్స్ ని స్కిన్ టైప్ ని బట్టీ, స్కిన్ ప్రాబ్లమ్ ని బట్టీ ఎంచుకోవాలి. . ఫేస్ పాక్స్ స్కిన్ ని లోపలి నుండి శుభ్రం చేస్తాయి.. చర్మం మీద ఉన్న మృతకణాలను తొలగిస్తాయి. అలాగే ఫేస్ పాక్స్ వల్ల స్కిన్ బాగా రిలాక్స్ అవుతుంది. స్కిన్ యంగ్ గా కనిపిస్తుంది. దానితో మీరు నిత్య యవ్వనవతులులాగా కనిపిస్తారు.


 ఇరిటేట్ అయి ఉన్న స్కిన్ ని ఫేస్ పాక్స్ చల్లబరుస్తాయి  ఫేస్ పాక్స్ స్కిన్ ఏజ్ అయ్యే ప్రాసెస్ ని స్లో డౌన్ చేస్తాయి. పొల్యూషన్, హార్ష్ వెదర్ వంటి వాటి వల్ల ముందు ఎఫెక్ట్ అయ్యేది స్కిన్ మాత్రమే. ఇందు వల్ల చర్మంలోని కాంతి అంతా పోతుంది. ఫేస్ పాక్స్ ఫ్రీ రాడికల్స్ తో పోరాడి బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచుతాయి. ఫలితంగా స్కిన్ స్మూత్ గా షైనీ గా తయారవుతుంది.. ఫేస్ పాక్స్ వల్ల ఇతర స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఎఫెక్టివ్ గా పని చేస్తాయి. ఫేస్ పాక్స్ స్కిన్ ని తయారుగా ఉంచుతాయి, స్కిన్ కేర్ యొక్క బెనిఫిట్స్ పొందడం కోసం క్రమం తప్పకుండా వేసుకుంటూ ఉండాలి . ఫేస్ పాక్స్ ఎంత నాచురల్ వి అయినా కూడా అందరికీ ఇవి పడతాయన్న గ్యారంటీ ఏమీ లేదు.

అందుకని ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తరువాతే వీటిని వాడాలి. అలాగే చర్మాన్ని కాపాడుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ యూజ్ చేయాలి..అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ ఉండాలి. అలాగే మీరు ఆనందించే విషయాల కొరకు కొంత సమయం కేటాయించుకోండి. ఆడవాళ్లు ముందుగా ఒత్తిడిని దూరం చేయాలి. ప్రతిరోజు మీ చర్మం గురించి కేర్ తీసుకోకపోయినా కనీసం వారానికి నాలుగు సార్లు అయిన తీసుకోండి. అలాగే మీ చర్మానికి ఎటువంటి ఫేస్ మాస్క్ సెట్ అవుతుందో తెలుసుకుని దాన్ని ఎంచుకోండి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: