భయాన్ని తగ్గించుకోవాలంటే ఇవి పాటించండి...?

MOHAN BABU
 మనం మొదటిసారి ఉద్యోగంలో చేరినప్పుడు  కాస్త బెరుకు, కంగారు పడడం సాధారణమే. మనం ఇంటర్వ్యూ వెళ్ళిన ప్పటి నుంచి  ఉద్యోగంలో చేరి అపాయింట్మెంట్ వరకు ఆన్లైన్  లోనే సాగుతున్న ప్రస్తుత కాలంలో ఈ భయం ఇంకాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో  సామాజిక దూరం, ఈ సమయంలో  అందరి మనసును గెలుచుకోవాలి అంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
**కొత్తగా నేర్చుకోవాలి**
 కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నామంటే  కొద్దిగా అనుభవం ఉన్న నీ కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నట్టే. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. స్కూల్, కళాశాల స్థాయిలో ఇంత మంచి ర్యాంకులు సాధించిన, మార్కులు వచ్చిన పని విషయంలో మాత్రం కొత్తగా నేర్చుకునేవే ఎక్కువ ఉంటాయి. కాబట్టి  ఉద్యోగం చేసేటప్పుడు పాత విషయాలను పక్కన పెట్టి, మనం చేసే పని పై  పట్టు సాధించాలనేది మన ధ్యేయం గా పెట్టుకోవాలి.
 **కొత్త వారిని పరిచయం చేసుకోండి **
 అందరూ కొత్త అమ్మాయి, కొత్త అబ్బాయి కదా  అని  ఆప్యాయంగా ఉంటారని అనుకోవద్దు. మనం కూడా ముందు వాళ్ళు వచ్చి పలకరిస్తారు అని కూడా అనుకోవద్దు.  ప్రస్తుత సమయంలో అన్ని సంస్థల కార్యకలాపాలు పనులన్నీ ఇంటి దగ్గర నుంచే చేస్తున్నారు కాబట్టి అవసరమైతే తప్ప మాట్లాడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మీరే ఎక్కువ చొరవ తీసుకొని మీ టీం సభ్యులను మొత్తం పరిచయం చేసుకోవాలి. పనిలో విషయాలు ఏంటని వారి దగ్గర్నుంచి అడిగి తెలుసుకోవాలి. వారి దగ్గర సాయం తీసుకోండి కానీ వారే వచ్చి చేస్తారులే అని అనుకోవడం మన పొరపాటు. ఒక్కోసారి వారే మీ పని పూర్తి చేస్తారు. అలా అని మనం కూడా పని చేయకుండా ఉండరాదు. మనం రోజు నేర్చుకోవడంతో పాటు పనిమీద మీ ఆసక్తిని ఎదుటివారికి తెలియజేసినట్టు అవుతుంది. కొన్నిసార్లు మనం ఎదుటి వారికి సాయం చేయాలని ఉన్న  పని కారణంగా కుదరక పోవచ్చు. అలాంటప్పుడు మీరు చేయవలసిన విధులు ఏంటో ముందే తెలుసుకుని  వాటిని సరైన సమయానికి పూర్తి చేసేలా ప్రణాళిక  వేసుకోవాలి. ఇది కూడా మన నేర్చుకోవడంలో భాగమే. కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు తప్పులు చేయడం సహజమే. కానీ  సంస్థ కంటూ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని ముందుగానే తెలుసుకుంటే చాలా వరకు తప్పు చేయకుండా చూసుకోవచ్చు.
 **సమయపాలన తప్పనిసరి పాటించాలి**
 మనం ఎక్కడ ఉద్యోగం చేస్తున్న ఆ సంస్థలు జరిగే ప్రతి పనిని గమనిస్తూ ఉంటాయి. కాబట్టి మనం మాట్లాడే మాట కానీ చేసే పని గాని చాలా జాగ్రత్తగా చేయాలి. సినిమాలు చర్చలు కబుర్లు ఎక్కువ సమయం ఇవ్వకూడదు. పని పట్ల నిబద్ధతతో బాధ్యతగా పని చేయాలి. ఇలా చేస్తే సంస్థ బాగుపడుతుంది. దానివల్ల మనం కూడా బాధపడతాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: