టీవీ: బాలయ్య దేవుడు అంటూ ఉదయభాను కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ సహాయమని అడిగితే కచ్చితంగా చేయడానికి ముందు వరుసలో ఉంటారు. బాలయ్యకు కోపం ఎక్కువని కొడతారనే టాక్ ఉన్నప్పటికీ బాలయ్యను దగ్గరనుంచి చూసినవారు మాత్రం ఆయన గురించి చాలా మంది కథలు కథలుగా చెబుతూ ఉంటారు. యాంకర్ ఉదయభాను జీవితంలో కూడా బాలయ్య చేసిన ఒక సహాయం ఎప్పటికీ మర్చిపోలేనిది అంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. మరి బాలయ్య, ఉదయభాను చేసిన అ సహయమేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

యాంకర్ ఉదయభాను ఒక షోలో పాల్గొన్నప్పుడు తాను 12 సంవత్సరాల వయసులో షోలు మొదలు పెట్టానని తన జీవితంలో సెలబ్రేషన్స్ అనేవి ఎప్పుడు చేయలేదు.. అయితే గర్భవతిగా ఉన్నప్పుడు కోరికలు పెరిగాయని తెలిపింది. శ్రీమంతం చేసుకోవాలని మహిళలు కోరుకుంటున్నారు.. తనకు అలాగే జరిగిందని..తనకు పిల్లలు అంటే చాలా ఇష్టమని ఈ విషయంపై మాటల్లో చెప్పలేనని తెలిపింది. అయితే చివరికి తనకు పిల్లలు కూడా పుట్టారని తన పిల్లల పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా  చేయాలని కొంతమంది తన దగ్గర ఉండే సెలబ్రిటీలను కాంటాక్ట్ అయితే అసలు రెస్పాండ్ కాలేదట..

బాలయ్య గారి నెంబర్ కి ఒక మెసేజ్ పెట్టానని కానీ ఆయన అరగంట తర్వాత ఫోన్ చేసి పుట్టినరోజు సెలబ్రేషన్స్ కి తాను వస్తానని మాట తనకు ఇచ్చారని  యాంకర్ ఉదయభాను తెలిపింది. అయితే బాలయ్య అప్పటికి వేరే ప్రాంతంలో మీటింగ్ ఉన్నప్పటికీ కూడా ఆ మీటింగ్ ఉన్న సైతం పూర్తి చేసి ఆయన చెప్పిన సమయానికే వచ్చారని వెల్లడించింది. అలా ఆ సమయంలో బాలయ్య తనకు చిన్నపాటి దేవుడుగా కనిపించారని.. సుమారుగా తన కుటుంబంతో కలిసి 45 నిమిషాల పాటు గడిపి పుట్టినరోజు వేడుకలలో తనకు ఆనందాన్ని ఇచ్చారని తెలిపింది.బాలయ్య చేసిన పనికి ఆరోజు తన చాలా ఎమోషనల్ గా అయ్యానని చెప్పడమే కాకుండా బాలయ్యకు హ్యాట్సాఫ్ చెప్పానని తెలిపింది ఉదయభాను.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: