అలాంటి వారందరి రేషన్ కార్డు రద్దు..!!
దేశంలో సుమారు 10 లక్షల మంది అక్రమంగా రేషన్ను పొందుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. గత ఏడాది అందుకు సంబంధించి హెచ్చరికలను కూడా జారీ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపుగా 80 కోట్ల మందికి రేషన్ కార్డు ఉందని వీరంతా కేంద్ర ప్రభుత్వం నుంచి పంపిణీ చేసిన ఫ్రీ రేషన్ను సద్వినియోగం చేసుకుంటున్నారని తెలియజేస్తోంది. ఇక కరోనా సమయంలో ప్రభుత్వాలు సైతం రేషన్ కార్డ్ హోల్డర్ కి నగదు సహాయం చేయడమే కాకుండా ఫ్రీగా రేషన్ను కూడా అందించారు.
తప్పుడు పత్రాలను సమర్పించి దొంగదారులో రేషన్ తీసుకున్న వారికి రేషన్ సరఫరా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నిర్ణయం తీసుకున్నది. త్వరలోనే అనర్హులందరి పూర్తి జాబితాను రేషన్ డీలర్లకు పంపుతామని తెలియజేసింది.. ఇప్పటికీ ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉందని తెలియజేస్తోంది కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యేక ఇన్కమ్ టాక్స్ చెల్లించేవారు లేకపోతే పది ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారు.. 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇల్లు ఫ్లాట్, కారు ఉన్న.. ఆయుధ లైసెన్స్ కుటుంబ ఆదాయం గ్రామాలలో రెండు లక్షలు నగరాలలో మూడు లక్షల కంటే ఎక్కువ ఉంటే రేషన్ కార్డు ఉన్నవారు.. వారి స్వయంగా తమ రేషన్ కార్డును వదులుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.