ఏ ముద్దు గుమ్మ అయినా కూడా ఓ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది అంటే ఆ ఎంట్రీ ఇచ్చిన సినిమాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నట్లయితే ఆమెకు వరుస పెట్టి ఆ ఇండస్ట్రీ లో సినిమా ఆఫర్లు వస్తూ ఉంటాయి. ఇక ఆ తర్వాత కూడా వారు మంచి సినిమాలను ఎంచుకొని వాటితో విజయాలను అందుకున్నట్లయితే ఆ ఇండస్ట్రీ లో వారు స్టార్ హీరోయిన్ల స్థాయికి చేరుకుంటారు. ఇకపోతే ఓ బ్యూటీ తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమానే స్టార్ హీరోలతో నటించింది. అలాగే ఆ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆమె వరస పెట్టి తెలుగు సినిమాల్లో నటిస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతున్న ఆ బ్యూటీ ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాలో కూడా నటించలేదు. అలాగే ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు. ఇంతకు ఆమె ఎవరు అనుకుంటున్నారా ..? ఆ నటి మరెవరో కాదు ఆలియా భట్.
ఈమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది. ఈ మూవీ లో ఈమె రామ్ చరణ్ కు జోడిగా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత ఈమె జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోయిన్గా కనిపించబోతుంది అని పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ సినిమాలో కూడా అలియా భట్ నటించలేదు. ఇక ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల అయ్యి చాలా సంవత్సరాలు అవుతున్న ఇప్పటి వరకు ఆలియా భట్ ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. అలాగే ఒక తెలుగు సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.