పాన్ ఇండియా కాదు.. దానికి అమ్మ మొగుడు లాంటి మూవీతో లాంచ్ కాబోతున్న అకీరా.. పవన్ పవర్ ఫుల్ ప్లాన్..!

Amruth kumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ సినీ రంగ ప్రవేశం కోసం తెలుగు సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా మెగా అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాలతో సంబంధం లేకుండా ఉన్నప్పటికీ, అకీరా ఎక్కడ కనిపించినా, ఆయన పుట్టినరోజు వచ్చినా సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తుంది.ప్రస్తుతం అకీరా సంగీతం, మార్షల్ ఆర్ట్స్ మీద దృష్టి పెడుతున్నారని, నటనలోనూ శిక్షణ తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. మరి అకీరాను లాంచ్ చేసే ఆ అదృష్టం ఏ దర్శకుడికి, ఏ నిర్మాతకు దక్కుతుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది.



పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత కీలక వ్యాఖ్యలు
ఈ క్రమంలోనే, ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి. విశ్వప్రసాద్ అకీరా నందన్ లాంచింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన పవన్ కళ్యాణ్‌తో తన అనుబంధం గురించి, అకీరాతో సినిమా చేసే అవకాశం గురించి మాట్లాడారు. "పవన్ కళ్యాణ్ గారితో నా పరిచయం, బంధం సినిమాలతో సంబంధం లేకుండా ఏర్పడింది. ఆ అనుబంధం వల్లే మా సంస్థలో సినిమా చేయడానికి ఆయన డేట్స్ ఇచ్చారు. అలా 'బ్రో' మూవీ చేశాం. మళ్లీ ఆయనతో సినిమా చేయాలని అనుకుంటున్నాం, ఆ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాం" అని విశ్వప్రసాద్ తెలిపారు.



అకీరాతో పాన్ వరల్డ్ మూవీ: అకీరాను లాంచ్ చేసే అవకాశం వస్తే కచ్చితంగా సినిమా చేస్తానని విశ్వప్రసాద్ స్పష్టం చేశారు. "అకీరాతో పాన్ ఇండియా కాదు... ఏకంగా పాన్ వరల్డ్ మూవీ తీస్తాం. త్వరలో మా సంస్థ నుంచి ఒక పాన్ వరల్డ్ సబ్జెక్ట్‌తో సినిమా రానుంది."



పర్ఫెక్ట్ హీరో మెటీరియల్: "అకీరా హైట్, పర్సనాలిటీని బట్టి చూస్తే అతను పర్ఫెక్ట్ హీరో మెటీరియల్. అతణ్ని లాంచ్ చేయాలనే ఆసక్తి నాకు ఉంది" అని ఆయన తన కోరికను బలంగా వ్యక్తం చేశారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇటీవల కాలంలో అనేక విజయాలను నమోదు చేసుకుంది.ఈ సంస్థ నిర్మించిన 'మిరాయ్' పెద్ద హిట్టయింది.సంక్రాంతికి ఈ సంస్థ నుంచి 'రాజాసాబ్' లాంటి భారీ చిత్రం విడుదల కాబోతోంది.అయినప్పటికీ, ఇటీవల విడుదలైన 'మోగ్లీ', 'తెలుసు కదా' వంటి చిన్న చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు.



అకీరా నందన్ ఎంట్రీ విషయంలో మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. టి.జి. విశ్వప్రసాద్ లాంటి అగ్ర నిర్మాత, అకీరాను లాంచ్ చేయాలని ఆసక్తి చూపడం... అది కూడా పాన్ వరల్డ్ స్థాయిలో సినిమా తీస్తానని చెప్పడం మెగా ఫ్యాన్స్‌కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. అకీరా లాంచింగ్ ఎప్పుడు జరుగుతుందో, ఆ మెగా ఛాన్స్ ఏ దర్శకుడికి దక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: