కో లివింగ్.. ఇప్పుడు వైజాగ్, విజయవాడలో కూడా..?

Divya
యువత ఈ మధ్య ఎక్కువగా చదువుకోవడానికి లేదా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఒక్కరే రూమ్ అద్దె తీసుకుంటే ఖర్చు ఎక్కువవుతుంది. అదే రూమ్ లో ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటే ఖర్చుతగ్గుతుందని ఆలోచిస్తుంటారు.అలాగే పనిలో ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చని , అలా యువత (బాయ్స్, గర్ల్స్) తమ రూమ్ ని షేర్ చేసుకుంటున్నారు.. దీంతో హాస్టల్స్ ఓనర్స్ కూడా బాగానే సంపాదించేవారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో హాస్టల్స్ మీద ఆదాయం కూడా పడిపోయింది.


ఎందుకంటే ఇప్పుడు ఇన్డ్యుజువల్ రూమ్స్ తీసుకుంటున్నారు.. అది కూడా స్వేచ్ఛ కోసమే. అలా ఒక ట్రెండ్ అయిపోయిన తర్వాత..ఇప్పుడు మరో కొత్త ట్రెండ్ ఏమిటంటే ఆడ ,మగ కలిసి జీవించడం.. అయితే విదేశాలలో మాత్రం ఈ కో లివింగ్ అనే పద్ధతి ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. అలా ఇక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఒక అపార్ట్మెంట్లో రెండు మూడు గదులు ఉండే వాటిని తీసుకొని ఒక్కొక్కరు ఒక్కో గదిలో ఉంటున్నారు. లేకపోతే ఇద్దరబ్బాయిలు కలిసి ఒక గది, ఇద్దరు అమ్మాయిలు కలిసి మరొక గది అలా ఉంటున్నారు అది కో లివింగ్.


కానీ ఇప్పుడు అలా కాకుండా ఒకే రూమ్ లో అబ్బాయి, అమ్మాయి  కో లివింగ్ అనేది ఇప్పుడు ఇండియాలో కూడా ట్రెండీగా మారింది. వీటికి ఆదాయం ఎక్కువగా వస్తోందట. ఏకంగా 30 నుంచి 40% వరకు పెరిగిందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. అయితే ఇది బెంగళూరు, హైదరాబాదు వంటి ప్రాంతంలో అయితే ఎక్కువగా వినిపిస్తోంది.కానీ తాజాగా విజయవాడ, వైజాగ్ ప్రాంతాలలో కూడా ఈ డిమాండ్ పెరిగింది. అయితే ఈ ప్రభావం భవిష్యత్ జీవితాల మీద ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..ముఖ్యంగా బ్లాక్ మెయిలింగ్ వంటివి చేసే అవకాశం కూడా ఉండొచ్చు అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. యువత అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అలాగే వివాహాలైనప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: